Sat Apr 26 2025 21:52:30 GMT+0000 (Coordinated Universal Time)
Subhashree rayaguru: బిగ్ బాస్ తెలుగు ఫేమ్ సుభశ్రీ కారుకు యాక్సిడెంట్
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ద్వారా పాపులారిటీని సంపాదించుకున్న

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ద్వారా పాపులారిటీని సంపాదించుకున్న సుభశ్రీ రాయగురు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈరోజు మధ్యాహ్నం నాగార్జున సాగర్ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సుభశ్రీ ప్రయాణిస్తున్న కారును బైక్ ఢీకొన్నట్లు సమాచారం. బైక్పై వెళ్తున్న వారు మద్యం మత్తులో ఉన్నట్లు సమాచారం. నాగార్జున సాగర్ బస్ డిపో సమీపంలో ఈ ఘటన జరిగింది. ఆ కారు సుభశ్రీది కాదని, ప్రొడక్షన్ వెహికల్ అని తెలుస్తోంది.
అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ పెద్దగా గాయాలు కాలేదు. బైక్పై ఉన్న వ్యక్తులు హెల్మెట్ ధరించి ఉండడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డారని సమాచారం. కారులో ఉన్న సుభశ్రీకి ఎలాంటి గాయాలు అవ్వలేదు. కారు ముందు భాగం కాస్త దెబ్బతింది. బైక్ రాంగ్ డైరెక్షన్లో వచ్చి కారును బలంగా ఢీ కొట్టిందని అధికారులు తెలిపారు.
Next Story