Tue Dec 24 2024 01:20:56 GMT+0000 (Coordinated Universal Time)
బిగ్ బాస్ 5 గ్రాండ్ ఫినాలే.. అతిథులు ఎవరో తెలుసా ?
బిగ్ బాస్ 5వ సీజన్ గ్రాండ్ ఫినాలే వీక్ మొదలయ్యింది. టాప్ 5 లిస్టులో శ్రీరామచంద్ర, మానస్, సిరి, సన్నీ, షన్ను నిలిచారు
బిగ్ బాస్ 5వ సీజన్ గ్రాండ్ ఫినాలే వీక్ మొదలయ్యింది. హౌస్ లో టాప్ 5 లిస్టులో శ్రీరామచంద్ర, మానస్, సిరి, సన్నీ, షన్ను నిలిచారు. సోమవారం ప్రసారమైన 100వ ఎపిసోడ్ లో హౌస్ లో శ్రీరామచంద్ర, మానస్ ల జర్నీ ని చూపించారు. మంగళ, బుధవారాల్లో ప్రసారమయ్యే ఎపిసోడ్ లలో షన్ను, సిరి, సన్నీ ల జర్నీలను వీడియోల రూపంలో చూపించనున్నారు బిగ్ బాస్. డిసెంబర్ 19వ తేదీ, ఆదివారం ఈ రియాలిటీ షో రియల్ విన్నర్ ఎవరో తేలిపోనుంది. బిగ్ బాస్ సీజన్ 5 గ్రాండ్ ఫినాలేకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రతి సీజన్ గ్రాండ్ ఫినాలే ను బిగ్ బాస్ ఎంత వైభవంగా జరిపిస్తారో తెలిసిందే. టాప్ సెలబ్రిటీ చేత బిగ్ బాస్ విన్నర్ ను ప్రకటించడం ఆనవాయితీగా వస్తోంది. ఇప్పటి వరకూ టాలీవుడ్ సెలబ్రిటీల వరకే పరిమితమైన ఈ ఆనవాయితీ.. ఈసారి బాలీవుడ్ తో కూడా మొదలు కానుంది.
బాలీవుడ్ నుంచి....
ఈ సీజన్ గ్రాండ్ ఫినాలే.. నెవర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్ అన్నట్లుగా సెలబ్రేట్ చేస్తున్నారట. ఈ ఫినాలేకు బాలీవుడ్ తారలు ముఖ్య అతిథులుగా రానున్నట్లు సమాచారం. రణ్వీర్ సింగ్, దీపికా పదుకొనే, అలియా భట్ లు గ్రాండ్ ఫినాలే కు విచ్చేస్తున్నట్లు హౌస్ టీమ్ నుంచి సమాచారం లీకైనట్లు తెలుస్తోంది. అలాగే రామ్ చరణ్, ఆర్ఆర్ఆర్ టీమ్ కూడా స్టేజ్ పై సందడి చేయనున్నట్లు టాక్. అలాగే టాలీవుడ్ కు చెందిన మరికొందరు సెలబ్రిటీలు కూడా ఈ స్టేజ్ పై తళుక్కుమవ్వనున్నారట. పెద్ద సెలబ్రిటీతోనే సీజన్ విన్నర్ పేరును అన్సౌన్స్ చేయిస్తారని సమాచారం. మరి ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియాలంటే.. సండే వరకూ ఆగాల్సిందే.
Next Story