Mon Dec 23 2024 12:14:02 GMT+0000 (Coordinated Universal Time)
బిగ్ బాస్ డే 2 - నామినేషన్లలోకి ముగ్గురు.. ఏడ్చేసిన రేవంత్.. గీతూ ఓవరాక్షన్
రెండోరోజు ట్రాష్ నుంచి ఒకరు క్లాస్ సభ్యుడితో మాట్లాడుకొని టీం చేంజ్ అవ్వొచ్చని చెప్పడంతో గీతూ క్లాస్లోకి ఎంటరవగా..
బిగ్ బాస్ సీజన్ 6 అట్టహాసంగా ప్రారంభమై..రెండు ఎపిసోడ్లను పూర్తిచేసుకుంది. తొలిరోజు కంటెస్టంట్ల డ్యాన్సులు, గొడవలు, ఏడుపులు, టాస్కులతో ఫర్వాలేదనిపించుకుందీ రియాలిటీ షో. మొదటిరోజు ఇంటిసభ్యులను క్లాస్, మాస్, ట్రాష్ అంటూ మూడు భాగాలుగా విడగొట్టిన సంగతి తెలిసిందే. క్లాస్ లోకి బాలాదిత్య, శ్రీహాన్, ఆర్జే సూర్య వెళ్లగా.. ట్రాష్ లోకి గీతూ రాయల్, ఇనయ సుల్తానా, రేవంత్ లు వెళ్లారు. మిగతా ఇంటి సభ్యులతా మాస్ గా ఉన్నారు. అయితే మధ్యమధ్యలో ఈ టీంలని చేంజ్ చేసుకునే అవకాశం కల్పించాడు బిగ్బాస్. దీంతో అందరూ బిగ్బాస్ ఇచ్చిన టాస్కులని ఆడి.. కొందరు టీమ్ లు ఛేంజ్ అయ్యారు.
రెండోరోజు ట్రాష్ నుంచి ఒకరు క్లాస్ సభ్యుడితో మాట్లాడుకొని టీం చేంజ్ అవ్వొచ్చని చెప్పడంతో గీతూ క్లాస్లోకి ఎంటరవగా బాలాదిత్య ట్రాష్లోకి వచ్చాడు. క్లాస్ టీంలో ఉన్న వాళ్ళు అన్ని సౌకర్యాలు అనుభవిస్తారని, ట్రాష్ లో ఉన్న వాళ్ళతో కాసేపు పనులు చేయించుకోవచ్చు అని చెప్పడంతో గీతూ తెగ హడావిడి చేసింది. చక్కగా సోఫా మీద కూర్చొని ట్రాష్ టీంలో ఉన్న వాళ్లకి ఆర్డర్స్ వేసింది. ఇనయా సుల్తానాని టార్గెట్ చేసి ఆమెకి పనులు చెప్తూ కౌంటర్లు వేసింది. దీంతో మరోసారి వీరిద్దరి మధ్య గొడవ అయింది.
టాస్క్ ముగిసే సమయానికి నేహా, ఆదిరెడ్డి, గీతూ క్లాస్ టీమ్లో మిగిలిన వారంతా వేరే టీమ్స్ లో ఉన్నారు. దీంతో క్లాస్ టీం వాళ్ళు నామినేషన్ నుంచి తప్పించుకున్నారు, అంతే కాక ఈ వారం ఈ ముగ్గురూ కెప్టెన్సీ పోటీదారులుగా ఉన్నారు. ఇక ట్రాష్ టీంలో ఉన్న బాలాదిత్య, అభినయ శ్రీ, ఇనయా సుల్తానా ఈ వారం డైరెక్ట్ గా నామినేట్ అయ్యారు. బుధవారం నామినేషన్స్ ఉంటాయని ముందే చెప్పడంతో.. ఈ వారం ఇంకా ఎవరైనా నామినేట్ అవుతారా ? లేక ఈ ముగ్గురే నామినేషన్లలో ఉంటారా అన్నది తెలియాల్సి ఉంది.
ఇక రెండో రోజు ఆటలో భాగంగా బిగ్ బాస్ ఇంటిసభ్యులకు మరో టాస్క్ ఇవ్వగా.. రేవంత్ ఈ టాస్క్ లో ఓడిపోయాడు. దీంతో బాత్రూమ్ లోకి వెళ్లి ఏడ్చాడు. ఇక భార్య భర్తలైన మెరీనా-రోహిత్ మధ్య కూడా గొడవలు వచ్చాయి. ఇనయా సుల్తానా నాకెవ్వరు సపోర్ట్ చేయట్లేదంటూ దూరంగా వెళ్లి పోయింది. ఇక గీతూ ఎప్పటిలాగే అందరిమీద కౌంటర్లు వేసింది. గీతూ ఉన్నంతసేపు చాలా హడావిడి చేయడంతో బాగా ఓవర్ యాక్షన్ చేస్తుందంటూ నెటిజన్లు కౌంటర్లు వేస్తున్నారు.
Next Story