Sun Dec 14 2025 04:00:49 GMT+0000 (Coordinated Universal Time)
సీపీఐ నారాయణను చెప్పుతో కొట్టాలి : తమన్నా సింహాద్రి సంచలన వ్యాఖ్యలు
రోజుకి ఒక గంట ప్రసారం చేస్తేనే.. అందులో ఉండే బూతు పురాణం చూడలేకపోతున్నామన్న ఆయన.. ఇక 24 గంటలు ప్రసారం చేస్తే..

హైదరాబాద్ : బిగ్ బాస్.. ఈ షో కి ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు బిగ్ బాస్ ఇప్పటి వరకూ 5 సీజన్లు పూర్తి చేసుకుంది. నిన్న బిగ్ బాస్ తెలుగు ఓటీటీ ఫస్ట్ సీజన్ ప్రారంభమవ్వగా.. 17 మంది కంటెస్టంట్లు హౌస్ లోకి వెళ్లారు. వారిలో 8 మంది పాత కంటెస్టెంట్లు ఉన్నారు. కాగా.. ఇప్పుడీ షో పై సీపీఐ నారాయణ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. ఆయన చేసిన వ్యాఖ్యలపై పెద్ద దుమారమే రేగుతోంది. సీపీఐ నారాయణ ఈ రియాలిటీ షోను తీవ్రంగా వ్యతిరేకిస్తూనే ఇది బిగ్ బాస్ హౌస్ అని పిలిచే వ్యభిచార గృహమని, అసభ్యకరమైన విషయాలను ప్రోత్సహిస్తూ ప్రజలపై బలవంతంగా రుద్దుతున్నారని, షో అనుమతిని రద్దు చేయాలని సంచలన కామెంట్స్ చేశారు.
Also Read : ఓటీటీలో డీజే టిల్లు.. ఎప్పట్నుంచో మీరే చూడండి !
రోజుకి ఒక గంట ప్రసారం చేస్తేనే.. అందులో ఉండే బూతు పురాణం చూడలేకపోతున్నామన్న ఆయన.. ఇక 24 గంటలు ప్రసారం చేస్తే.. అందులో ఉండే కంటెంట్ యువతపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సీపీఐ నారాయణ చేసిన వ్యాఖ్యలపై బిగ్ బాస్ మాజీ కంటస్టెంట్ తమన్నా సింహాద్రి ఘాటుగా స్పందించింది. తాజాగా జరిగిన ఓ టీవీ డిబేట్ లో తమన్నా మాట్లాడుతూ.. బిగ్ బాస్ పై ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు సీపీఐ నారాయణను చెప్పుతో కొట్టాలన్నారు. ఈ వ్యాఖ్యలపై డిబేట్ లో పాల్గొన్న ఇతరులు అభ్యంతరం వ్యక్తం చేశారు. నారాయణపై తమన్నా చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కానీ.. తమన్నా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా బిగ్ బాస్ షోను సమర్థిస్తూ అదే తమకు గుర్తింపు తెచ్చిపెట్టిందని, బయట ఊహిస్తున్నది నిజం కాదని అన్నారు. పైగా షో నచ్చనివాళ్లు బలవంతంగా చూడాల్సిన పనిలేదని బదులిచ్చింది.
Next Story

