Fri Dec 20 2024 18:49:32 GMT+0000 (Coordinated Universal Time)
ప్రియాంక ఇలా టర్న్ అయిందేమిటి?
బిగ్ బాస్ కంటెస్టెంట్ ప్రియాంక గ్రూప్ చేంజ్ అయినట్లే కనపడుతుంది. ప్రస్తుతం ఆమె షణ్ముఖ్ వర్గంలో ఉన్నట్లు కనిపిస్తుంది.
బిగ్ బాస్ కంటెస్టెంట్ ప్రియాంక గ్రూప్ చేంజ్ అయినట్లే కనపడుతుంది. ప్రస్తుతం ఆమె షణ్ముఖ్ వర్గంలో ఉన్నట్లు కనిపిస్తుంది. కాజల్ ను నామినేట్ చేయడమే కారణంగా చూస్తున్నారు. బిగ్ బాస్ హౌస్ లోకి ప్రియాంక ప్రత్యేక పరిస్థితుల్లో వచ్చారు. ట్రాన్స్ జెండర్ గా దాదాపు పన్నెండు నెలలు హౌస్ లో కొనసాగడం మామూలు విషయం కాదు. తొలి నుంచి ప్రియాంక మానస్ తో అనుబంధం కావాలన్నట్లుగానే నడుచుకునే వారు. కానీ మానస్ తొలి నుంచి కొంత దూరం పెడుతూనే వస్తున్నారు.
కాజల్ ను నామినేట్ చేసి....
ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఏడుగురు కంటెస్టెంట్లు ఉన్నారు. వీరిలో సన్నీ, మానస్, కాజల్ ఒక గ్రూపుగా, సిరి, షణ్ముఖ్ ఒక గ్రూపుగా ఉన్నారు. శ్రీరామచంద్ర ఒంటరివాడు కావడంతో అతనిని దగ్గరకు తీయాలని షణ్ముఖ్ సిరితో అన్నాడు. దీనికి తోడు ఇప్పుడు ప్రియాంక కాజల్ ను నామినేట్ చేసింది. తనను సేవ్ చేయడానికి వాడిన కమ్యునిటీ అనే పదాన్ని వాడిందన్న విషయాన్ని మరిచిపోయి కాజల్ ను నామినేట్ చేసింది. దీంతో మానస్ ప్రియాంకపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు కనపడుతుంది. ఇద్దరి మధ్య మరింత దూరం పెరిగినట్లు ప్రోమోలో కన్పిస్తున్నాయి.
Next Story