Sat Dec 21 2024 01:43:08 GMT+0000 (Coordinated Universal Time)
హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసిన బిగ్బాస్ రతిక.. ఎవరి సినిమాలో తెలుసా..?
బిగ్బాస్ హౌస్ నుంచి బయటకి వచ్చేసిన రతిక.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ అందుకుంది.
తెలుగు బిగ్బాస్ సీజన్ 7లో కంటెస్టెంట్గా అడుగుపెట్టిన రతిక రోజ్.. మంచి ఫేమ్ ని సంపాదించుకుంది. హీరోయిన్ అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చి, ఎప్పటి నుంచో ఆర్టిస్ట్ గా కొనసాగుతున్నా.. మంచి గుర్తింపు సంపాదించుకోలేక పోయింది. కానీ బిగ్బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి కేవలం నాలుగు వారాలే హౌస్ లో ఉన్నపటికీ.. తన ఆట తీరుతో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అయ్యింది. ఇక ఎలిమినేషన్ అయ్యి బయటకి వచ్చేసిన ఆమెను.. మళ్ళీ తీసుకు రావాలని అభ్యర్థనలు కూడా వస్తున్నాయి.
ఇది ఇలా ఉంటే, రతిక ఒక స్టార్ దర్శకుడు సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ అందుకుందట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తెలియజేసింది. ఒక ఇంగ్లీష్ పేపర్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రతిక ఈ విషయం బయట పెట్టింది. గతంలో దృశ్యం 2, నారప్ప, నేను స్టూడెంట్ సర్.. సినిమాల్లో రతిక చిన్న చిన్న పాత్రల్లో నటించిందట. ఇప్పుడు ఏకంగా స్టార్ డైరెక్టర్ దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు సినిమాలో హీరోయిన్ గా అవకాశం అందుకుందట.
రతిక ఫోటోలు, గత సినిమాల్లో తను నటించిన కొన్ని సన్నివేశాలు చూసిన రాఘవేంద్రరావు.. తన సినిమాలో హీరోయిన్ గా రతిక అయితే బాగుటుందని భావించాడట. ఈక్రమంలోనే తనకి హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చినట్లు చెప్పుకొచ్చింది. ఒక ఎమోషనల్ లవ్ స్టోరీతో ఈ సినిమా తెరకెక్కబోతుందని రతిక తెలియజేసింది. రాఘవేంద్రరావు సినిమాలు ద్వారా హీరోయిన్ గా పరిచయమైన యాక్ట్రెస్లంతా మంచి ఫేమ్ ని సంపాదించుకున్నారు. మరి ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలవుతుందో చూడాలి.
కాగా బిగ్బాస్ హౌస్ నుంచి బయటకి వచ్చేసిన రతిక.. మళ్ళీ ఈ వారం హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమెతో పాటు గతంలో ఎలిమినేట్ అయిన సింగర్ దామిని, శుభ శ్రీ కూడా ఎంట్రీ ఇచ్చారు. ఈ ముగ్గురిలో ఒకరు మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ బిగ్బాస్ తెలియజేశాడు. ఈ ఆదివారం వీరి ఎంట్రీ కోసం ఓటింగ్ పెట్టిన బిగ్బాస్.. వచ్చే శనివారం ఆ కంటెస్టెంట్ ని లోపలికి పంపిస్తాను అంటూ పేర్కొన్నాడు.
Next Story