Tue Dec 24 2024 02:28:17 GMT+0000 (Coordinated Universal Time)
వెళ్లలేక.. విడిచి ఉండలేక... ప్రియాంక
బిగ్ బాస్ హౌస్ మరో కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యారు. ప్రియాంక సింగ్ ఈ వారం ఎలిమినేట్ కావడంతో ఉద్విగ్న వాతావరణం ఏర్పడింది.
బిగ్ బాస్ హౌస్ మరో కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యారు. ప్రియాంక సింగ్ ఈ వారం ఎలిమినేట్ కావడంతో హౌస్ లో ఒకరకమైన ఉద్విగ్న వాతావరణం ఏర్పడింది. బిగ్ బాస్ హౌస్ మొదలు నుంచి కంటెస్టెంట్లందరికీ ప్రియాంక రుచికరమైన భోజనం వండి పెట్టేది. వెజ్, నాన్ వెజ్ ఏది అడిగితే దానిని వండి తినిపించడంతో అందరి కంటెస్టెంట్లకు ప్రియాంక ఆత్మీయురాలిగా మారింది. అందరితో అన్నా అంటూ (ఒక్క మానస్ తప్ప) కలివిడిగా ఉండేది.
మానస్ తో కెమిస్ట్రీ.....
చివరి రౌండ్ సిరి, ప్రియాంక ఎలిమినేషన్ కు మిగలడంతో అందరూ ఊహించినట్లే ప్రియాంక బయటకు వెళ్లిపోయింది. ఒక ట్రాన్స్ జెండర్ గా హౌస్ లోకి వచ్చిన ప్రియాంక అందరి మనసులను గెలుచుకుంది. ముఖ్యంగా మానస్ తో నడిపిని కెమెస్ట్రీ పండించింది. అందుకే ప్రియాంకకు ఎక్కువగా స్క్రీన్ స్పేస్ లభించింది. ప్రియాంక మానస్ వదలలేక వెళ్లింది. జీవితాంతం ఫ్రెండ్స్ గానే ఉందామంటూ వీడ్కోలు చెప్పి కన్నీరు మున్నీరవుతూ వెళ్లిపోయింది. ఇక హౌస్ లో శ్రీరామచంద్ర, సన్నీ, మానస్, షణ్ముఖ్, సిరి, కాజల్ లు మాత్రమే ఉన్నారు. టాప్ 5 లో ఎవరుంటారన్నది ఈ వారం తేలిపోనుంది.
Next Story