Mon Dec 23 2024 16:54:14 GMT+0000 (Coordinated Universal Time)
రష్మిక నన్ను కాపీ కొడుతోంది.. లోబో పోస్టు వైరల్..
రష్మిక మందన్న నన్ను కాపీ కొడుతోంది అంటూ లోబో చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది.
టాటూ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న లోబో.. తన డ్రెస్సింగ్ స్టైల్ తో యూట్యూబ్, టీవీ షోల్లో కనబడి మరింత ఫేమ్ని అందుకున్నాడు. ఆ తరువాత బిగ్బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చి రెండు రాష్ట్రాల్లో గుర్తింపు తెచ్చుకున్నాడు. లోబో అనగాని అందరికి ముందుగా గుర్తుకు వచ్చేది.. అతడి డ్రెస్సింగ్ స్టైల్, గెటప్. కలర్ కలర్ డ్రెస్సులు, డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ తో యూత్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు.
అలాగే కాళ్ళకి వేసుకునే చెప్పులు, షూలు విషయంలో కూడా లోబో క్రేజీగా ఆలోచించే వాడు. సాధారణంగా మనం రెండు కాళ్ళకి ఒకే రంగు షూస్ ని దరిస్తాము. కానీ లోబో అలా కాదు. ఒక కాలుకి ఒక కలర్ షూ వేస్తే.. మరో కాలుకి మరో రంగు షూ వేసేవాడు. దేశం మొత్తం మీద.. ఇలాంటి డ్రెస్సింగ్ స్టైల్ ని ఒకప్పుడు కేవలం లోబో మాత్రమే మెయిన్టైన్ చేసేవాడు అనడంలో సందేహం అవసరం లేదు అనుకుంటా.
అయితే ఈ స్టైల్ ఇప్పుడు ట్రేండింగ్ లోకి వస్తుంది. ఎప్పుడో లోబో సెట్ చేసిన ఈ ట్రెండ్ని.. ఇప్పుడు టాలీవుడ్ టు బాలీవుడ్ చాలా మంది ఫాలో అవుతున్నారు. ఇటీవల కాలంలో సినిమా స్టార్స్ డ్రెస్సింగ్ స్టైల్ చూస్తే.. నాలుగు రంగు రంగు బట్ట ముక్కల్ని అతుకులు వేసి షర్ట్లా వేసుకోవడం, అలాగే కాళ్ళకి కూడా రెండు రకాల షూలు ధరిస్తూ డిఫరెంట్ గా కనిపిస్తున్నారు. ఇలా మెయిన్టైన్ చేస్తున్న వారిలో రష్మిక మందన్న, శిల్పా శెట్టి, విజయ్ దేవరకొండ, రణవీర్ సింగ్ కూడా ఉన్నారు.
వీరంతా ఈ ట్రెండ్ సెట్ చేశాము అనుకుంటున్నారు. కానీ లోబో ఎప్పుడో స్టార్ట్ చేసిన ట్రెండ్ ని వీరంతా ఇప్పుడు ఫాలో అవుతున్నారు. ఇక ఈ విషయాన్ని తెలియజేస్తూనే లోబో.. తన ఇన్స్టాగ్రామ్ లో కొన్ని ఫోటోలు షేర్ చేశాడు. ఆ ఫొటోల్లో రష్మిక, శిల్పా శెట్టి, మరికొంతమంది స్టార్స్.. తమ కాళ్ళకి రెండు రకాల షూలు ధరించి కనిపిస్తున్నారు. ఈ పోస్టు చూసిన నెటిజెన్స్.. నువ్వు ట్రెండ్ సెట్టర్ బ్రో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Next Story