Mon Dec 23 2024 20:22:34 GMT+0000 (Coordinated Universal Time)
ఈ వారం ఎలిమినేట్ అయింది?
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో బిగ్ బాస్ నాన్ స్టాప్ షోలో ఈరోజు ఎలిమినేషన్ ఉంది. చైతు ఎలిమినేట్ అయ్యారని తెలుస్తోంది.
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో బిగ్ బాస్ నాన్ స్టాప్ షోలో ఈరోజు ఎలిమినేషన్ ఉంది. అయితే ఈసారి ఆర్జే చైతు ఎలిమినేట్ అయ్యారని తెలుస్తోంది. గత వారమే ఆర్జే చైతూ హౌస్ కెప్టెన్ గా ఎంపికయ్యారు. అయినా ఓటింగ్ శాతం తక్కువగా ఉండటంతో ఆర్జే చైతూ ఎలిమినేట్ అయినట్లు చెబుతున్నారు. దాదాపు పదమూడు మంది కంటెస్టెంట్లలో చైతూ, శివ చివరి రౌండ్ వరకూ నిలిచారు. కానీ శివకు ఓట్లు ఎక్కువ రావడంతో ఆర్జే చైతూ ఎలిమినేట్ అయ్యారు.
బిగ్ బాస్ నాన్ స్టాప్....
బిగ్ బాస్ నాన్ స్టాప్ మూడో వారంలోకి ప్రవేశించింది. ఇప్పటి వరకూ ముమైత్ ఖాన్, శ్రీ రాపాక ఎలిమినేట్ అయ్యారు. మూడో వారం ఆర్జే చైతూ ఎలిమినేట్ అయ్యారని తెలుస్తోంది. నాన్ స్టాప్ షో కు పెద్దగా ఆదరణ లభించకపోయినప్పటికీ నిర్వాహకులు షోను లాగేస్తున్నారని తెలిసింది. ఈ షో వంద రోజులకు పైగానే సాగనుంది.
Next Story