Mon Dec 23 2024 20:27:25 GMT+0000 (Coordinated Universal Time)
బిగ్ బాస్ మరో ట్విస్ట్.. ఈ వారం ఎలిమినేషన్ లో ఎవరంటే?
బిగ్ బాస్ సీజన్ 5 ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ సీజన్ లో లవ్ ట్రాక్ ను స్టార్ట్ చేసి చివరకు ఫ్రెండ్ షిప్ గా చూపారు.
బిగ్ బాస్ సీజన్ 5 ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ సీజన్ లో లవ్ ట్రాక్ ను స్టార్ట్ చేసినా చివరకు ఫ్రెండ్ షిప్ గా చూపి సస్పెన్స్ ను బిగ్ బాస్ కొనసాగించాడు. ఇప్పుడు ఎనిమిది మంది కంటెస్టెంట్లు బిగ్ బాస్ లో ఉన్నారు. ఈరోజు ఎలిమినేషన్ లో రవి, షణ్ముక్, ప్రియాంక, కాజల్ ఉన్నారు. మానస్ కెప్టెన్ కావడంతో అతను ఎలిమినేషన్ లో లేడు. సన్నీ, శ్రీరామచంద్ర, సిరి నిన్న సేవ్ అయ్యారు.
స్ట్రాంగ్ గా ఉన్నా....
మిగిలిన వారు నలుగురు. వీరిలో యాంకర్ రవి, షణ్ముఖ్ లు స్ట్రాంగ్ గా తొలి నుంచి ఆడతున్నారు. షణ్ముఖ్ పెద్దగా ఆడకపోయినా కంటెంట్ తో స్క్రీన్ స్పేస్ ఎక్కువగా షేర్ చేసుకున్నాడు. ఇక కాజల్ కూడా స్ట్రాంగ్ గా ఆడుతుంది. ఒక్క ప్రియాంక ఒక్కటే మానస్ తో లవ్ ట్రాక్ నడుపుతూ నెట్టుకొస్తుంది. ఈవారం ప్రియాంక ఎలిమినేట్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ ట్విస్ట్ ఏంటంటే స్ట్రాంగ్ అనుకుంటున్న రవి ఈవారం ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ ఇక మూడు వారాలే మిగిలి ఉన్నాయి.
Next Story