Mon Dec 23 2024 08:46:30 GMT+0000 (Coordinated Universal Time)
Bigg Boss 7 : 9 వారాలకు టేస్టీ తేజ ఎంత సంపాదించాడో తెలుసా?
9వ వారం ఎలిమినేట్ అయిన టేస్టీ తేజ ఎంత సంపాదించాడో తెలుసా?
Bigg Boss 7 : తెలుగు బిగ్‌బాస్ సీజన్ 7లో మొన్నటి వరకు వరుసగా లేడీ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. ఇప్పుడు అబ్బాయిలు వంతు వచ్చినట్టు ఉంది. లాస్ట్ వీక్, ఈ వీక్ ఇద్దరు అబ్బాయిలే బయటకి వచ్చారు. అది కూడా హౌస్ లో చాలా యాక్టీవ్ గా ఉండే కంటెస్టెంట్స్ బయటకి రావడం గమనార్హం. గత వారం ఆట సందీప్ బయటకి వచ్చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ 9వ వారం టేస్టీ తేజ ఎలిమినేట్ అయ్యాడు.
హౌస్ లో కొంచెం కామెడీ క్రియేట్ చేస్తున్న కంటెస్టెంట్ అంటే టేస్టీ తేజనే. హౌస్ లోని మెంబెర్స్ తో పాటు ఆడియన్స్ ని కూడా అలరిస్తూ వస్తున్నాడు. అలాంటిది టేస్టీ తేజ బయటకి వచ్చేయడం కొంచెం షాకింగ్ గానే ఉంది. ఇక గత వారం ఆట సందీప్ ఎలిమినేషన్ గురించి బోరున ఏడ్చేసిన శోభాషెట్టి.. ఈ వారం టేస్టీ తేజ ఎలిమినేషన్ తో కూడా కన్నీళ్లు పెట్టుకొని ఎమోషనల్ అయ్యింది. నువ్వు లేకుండా హౌస్ ఉండలేను అంటూ చెప్పుకుంటూ వచ్చింది. కాగా 9 వారాలు హౌస్ లో ఉన్న టేస్టీ తేజ ఎంత సంపాదించాడో తెలుసా..?
టేస్టీ తేజ వారానికి రూ.1.5 లక్షల రెమ్యూనరేషన్ అగ్రిమెంట్ తో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇక 9 వారాలు పూర్తి అయ్యి బయటకి వెళ్ళేటప్పుడు.. తేజ దాదాపు రూ.13.5 లక్షలు ఇంటికి తీసుకు వెళ్లినట్లు సమాచారం. యూట్యూబ్ ఇంటర్వ్యూలు, ఫుడ్ బ్లాగ్ వీడియోలు చేసే తేజ 13 లక్షల వరకు అందుకున్నాడు అంటే.. బాగానే వసూలు చేశాడని తెలుస్తోంది.
14 మంది కంటెస్టెంట్స్ తో మొదలైన బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 మొదటి ఐదు వారాల్లో ఐదుగురు ఎలిమినేట్ అవ్వడం, మళ్ళీ ఐదుగురు వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ ఎలిమినేట్ అయ్యి బయటకి వెళ్లిన రతిక మళ్ళీ ఎంట్రీ ఇవ్వడం, ఈ వారం ఎలిమినేషన్‌తో.. ప్రస్తుతం హౌస్ లో 11 మంది ఉన్నారు. శివాజీ, ప్రశాంత్, గౌతమ్, అశ్విని, అర్జున్ అంబటి, యావర్, బోలే షవాలి, అమర్ దీప్, రతికారోజ్, శోభా శెట్టి, ప్రియాంక జైన్.. ప్రస్తుతం వీరు హౌస్ లో ఉన్నారు.
Next Story