Tue Dec 24 2024 00:16:07 GMT+0000 (Coordinated Universal Time)
బిగ్ బాస్ విన్నర్ బిందుమాధవి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా ?
ఓటీటీలో టెలికాస్ట్ అయిన ఈ సీజన్ లో టాలీవుడ్ నటి, హీరోయిన్ బిందు మాధవి విన్నర్ గా నిలిచింది. తెలుగు బిగ్ బాస్ సీజన్లలో
తెలుగు బిగ్ బాస్ నాన్ స్టాప్ ఓటీటీ ఇటీవలే పూర్తయింది. ఓటీటీలో టెలికాస్ట్ అయిన ఈ సీజన్ లో టాలీవుడ్ నటి, హీరోయిన్ బిందు మాధవి విన్నర్ గా నిలిచింది. తెలుగు బిగ్ బాస్ సీజన్లలో తొలిసారి మహిళ విన్నర్ గా నిలిచింది. విన్నర్ గా బిందుమాధవి రూ.40 లక్షలు ప్రైజ్ మనీ అందుకుంది. రెమ్యునరేషన్ ఎంత తీసుకుంది ? బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన కంటెస్టెంట్లు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారో తెలుసుకోవాలన్న కుతూహలం అందరికీ ఉంటుంది. హౌస్ నుంచి బయటికి వచ్చాక కంటెస్టంట్లు ఇచ్చే ఇంటర్వ్యూల్లో రెమ్యునరేషన్ గురించి అడిగినా.. చాలా మంది చెప్పరు.
ఇప్పుడు బిందుమాధవి రెమ్యునరేషన్ ఎంత తీసుకుందన్న దానిపైనే చర్చ జరుగుతోంది. బిగ్ బాస్ తెలుగు ఓటీటీ నాన్ స్టాప్ లో ఫినాలే లో అఖిల్, అరియానా, బింధుమాధవిలు నిలిచారు. విన్నర్ ప్రైజ్ మనీ రూ.50 లక్షలు కాగా.. ఫినాలేలో ఇద్దర్నే ఉంచేందుకు ప్రైజ్మనీలోంచి 10 లక్షలు ఆఫర్ చేశారు. అరియానా ఆ రూ.10 లక్షలు తీసుకుని వచ్చేసింది. అఖిల్, బిందుమాధవిలలో బిందుని విన్నర్ గా ప్రకటించారు హోస్ట్ నాగార్జున.
విన్నర్ ప్రైజ్ మనీతో పాటు బిందుమాధవి వారానికి రూ.5లక్షలు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం. ఈ లెక్క ప్రకారం బిందు 12 వారాలు హస్ లో ఉంది. అంటే రూ.60 లక్షలు. విన్నింగ్ ప్రైజ్ మనీ రూ.40 లక్షలు. మొత్తం కోటి రూపాయలు. వాటిలో ట్యాక్సులు పోగా.. చేతికి రూ.70 లక్షలు వస్తాయి. మొత్తం మీద బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లడంతో బిందుమాధవి రూ.70 లక్షలు సంపాదించిందనమాట. ఇక హౌస్ నుంచి బయటికి వచ్చాక ఆఫర్లు రావడం మామూలే. ఇప్పటికే ఒక సినిమాకు బిందుమాధవి సైన్ చేసినట్లు తెలుస్తోంది.
Next Story