Tue Dec 24 2024 02:03:30 GMT+0000 (Coordinated Universal Time)
గ్రాండ్ ఫినాలే అదుర్స్ అట
బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 గ్రాండ్ ఫినాలే మరికాసేపట్లో ప్రారంభంకానుంది.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 గ్రాండ్ ఫినాలే మరికాసేపట్లో ప్రారంభంకానుంది. విజేతలు ఎవరన్నది పక్కన పెడితే ఈ మార్ థాన్ షో అదిరిపోతుందని నిర్వాహకులు చెబుతున్నారు. ప్రోమోలు చూసినా అదే అర్థమవుతుంది. బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం ఐదు కంటెస్టెంట్లున్నారు. సన్నీ, మానస్, షణ్ముఖ్, శ్రీరామచంద్ర, సిరిలు ఉన్నారు. వీరిలో విజేత ఎవరన్నది దాదాపుగా ఇప్పటికే తేలిపోయింది. సన్నీయే విజేత అని బయటకు లీకులు వచ్చేశాయి. రన్నరప్ గా శ్రీరామచంద్ర నిలిచారని తెలుస్తోంది.
మూడు సినిమాల నుంచి....
అయితే షో లో శ్యామ్ సింగరాయ్ మూవీ ప్రమోషన్ కోసం నేచురల్ స్టార్ నాని, సాయిపల్లవిలు సందడి చేయనున్నారు. నేరుగా వారిద్దరూ హౌస్ లోకి వెళ్లి కంటెస్టెంట్స్ తో కొద్ది సేపు గడపనున్నారు. ఇక రాజమౌళి బ్రహ్మాస్త్ర నుంచి రణబీర్ కపూర్, ఆలియా భట్, పుష్ప సినిమా ప్రమోషన్ కోసం దర్శకుడు సుకుమార్, రష్మిక మందన్న, దేవిశ్రీ ప్రసాద్ లు స్టేజీ పై హడావిడి చేయనున్నారు. మొత్తం మీద బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే అదిరిపోయేలా నిర్వాహకులు ప్లాన్ చేశారు.
Next Story