Mon Dec 23 2024 11:40:07 GMT+0000 (Coordinated Universal Time)
బిగ్ బాస్ హౌస్ లోకి ఆర్జీవీ మెచ్చిన బ్యూటీ.. నటీనటులు, జబర్దస్త్ ఆర్టిస్టులు
బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టంట్ల లిస్ట్ అని ఓ లిస్టు వైరల్ అవుతోంది. ఆ లిస్టులో ఆర్జీవీ మెచ్చిన బ్యూటీ ఇనయ సుల్తానా పేరు కూడా..
తెలుగు బుల్లితెర ఆడియన్స్ ఆదరణ పొందిన షో బిగ్ బాస్. వరుసగా ఐదు సీజన్లు సక్సెస్ గా రన్ అయిన ఈ రియాలిటీ షో.. బిగ్ బాస్ నాన్ స్టాప్ ఎంటర్టైన్ మెంట్ అంటూ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో 24 గంటల లైవ్ టెలీకాస్ట్ చేశారు. కానీ కొన్నిరోజులకే అది వర్కవుట్ కాలేదు. ఎలాగో ఒకలా దానిని పూర్తి చేశారు. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 6 కోసం భారీగా కసరత్తులు జరుగుతున్నాయి. ఈ సీజన్ కోసం బిగ్బాస్ హౌస్ గేట్ దగ్గర నుంచి లోపల బెడ్రూమ్ వరకు అన్నీ అందంగా అమర్చారట. అలాగే కంటెస్టెంట్ల ఎంపిక దగ్గర నుంచి ఎలిమినేషన్స్ వరకు అన్నీ పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నట్లు టాక్.
ఇప్పటికే కంటెస్టంట్ల ఎంపిక పూర్తి కాగా.. అసలు లిస్టులో ఎవరున్నారన్నది సస్పెన్స్. కానీ నెట్టింట్లో ఇదే బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టంట్ల లిస్ట్ అని ఓ లిస్టు వైరల్ అవుతోంది. ఆ లిస్టులో ఆర్జీవీ మెచ్చిన బ్యూటీ ఇనయ సుల్తానా పేరు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఆర్య సినిమాలో అ అంటే అమలాపురం ఐటం సాంగ్ తో టాలీవుడ్ ను ఒక ఊపు ఊపిన అభినయ శ్రీ ఈసారి హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. అలాగే నటుడు బాలాదిత్య, యూట్యూబర్, ఆదిరెడ్డి, గలాటా గీతూ, నువ్వు నాకు నచ్చావ్ ఫేమ్ పింకీ- సుదీప, జబర్దస్త్ కమెడియన్లు ఫైమా, చలాకీ చంటి, నటుడు శ్రీహాన్, సింగర్ రేవంత్, వాసంతి కృష్ణన్, యాంకర్ ఆరోహి రావు, తన్మయ్, శ్రీసత్య, బుల్లితెర దంపతులు రోహిత్-మెరీనా అబ్రహం, కామన్ మ్యాన్ రాజశేఖర్, అర్జున్ కల్యాణ్, దీపిక పిల్లి కంటెస్టెంట్లుగా పాల్గొననున్నట్లు తెలుస్తోంది. ఒకరిద్దరు మినహా.. మిగతా వారంతా హౌస్ లోకి వెళ్తారని సమాచారం.
కాగా.. ఈ సీజన్లో కొన్నిమార్పులు, చేర్పులు చేశారట. మామూలుగా బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్లు సోమవారం జరుగతాయి. కానీ ఈసారి మాత్రం బుధవారం ఈ టాస్కును ప్రసారం చేయనున్నట్లు టాక్. వీక్ డేస్ లో బిగ్ బాస్ ను ప్రేక్షకులు పెద్దగా చూడకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 4వ తేదీ సాయంత్రం ఈ షో గ్రాండ్ గా ప్రారంభం కానుంది. నేడు నాగార్జున పుట్టినరోజు సందర్భంగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓ పోస్టర్ తో ఆయనకు బర్త్ డే విషెస్ చెప్తూ.. ట్వీట్ చేసింది.
News Summary - bigg boss telugu season 6 contestants list goes viral in social media
Next Story