Mon Dec 23 2024 11:31:57 GMT+0000 (Coordinated Universal Time)
బిగ్ బాస్ హౌస్ లోకి సింగర్ రేవంత్.. క్వారంటైన్ లో హౌస్ మేట్స్
సింగర్ రేవంత్ ఇండియన్ ఐడల్ సీజన్ 9 విజేతగా నిలిచాడు. తెలుగు, కన్నడ భాషల చిత్రాల్లో ఇప్పటి వరకూ 200కి పైగా..
నాన్ స్టాప్ ఎంటర్టైన్ మెంట్ కు కౌంట్ డౌన్ స్టార్ అయింది. రేపు సాయంత్రం స్టార్ మా లో బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 గ్రాండ్ గా ప్రారంభం కానుంది. హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చే కంటెస్టంట్స్ ఎవరా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో నెట్టింట్లో ఇదే బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టంట్స్ అని ఓ లిస్ట్ చక్కర్లు కొడుతోంది. ఆ లిస్ట్ ప్రకారం ఈసారి సింగర్ రేవంత్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకూ జరిగిన 5 సీజన్లలో ప్రతి సీజన్ లో హౌస్ లోకి సింగర్ ఎంట్రీ ఇచ్చారు. ఈసారి రేవంత్ హౌస్ లోకి రానున్నట్లు సమాచారం.
సింగర్ రేవంత్ ఇండియన్ ఐడల్ సీజన్ 9 విజేతగా నిలిచాడు. తెలుగు, కన్నడ భాషల చిత్రాల్లో ఇప్పటి వరకూ 200కి పైగా పాటలు పాడిన రేవంత్.. సూపర్ సింగర్ లోనూ రేవంత్ పాల్గొన్నాడు. రేవంత్ పాడిన పాటల్లో చాలా వరకూ హిట్ సాంగ్స్ ఉన్నాయి. ఇక ఇటీవలే రేవంత్ వివాహం చేసుకున్నాడు. కొత్తగా పెళ్లైన రేవంత్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తున్నాడని వస్తున్న వార్తల్లో ఎంతవరకూ నిజముందో తెలియాలంటే రేపు సాయంత్రం వరకూ ఆగాల్సిందే. ఇక నెట్టింట్లో వైరల్ అవుతున్న లిస్ట్ ప్రకారం హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చే కంటెస్టంట్ల వివరాలిలా ఉన్నాయి.
ఇప్పటివరకు బిగ్బాస్6వ సీజన్లో 18 మంది కంటెస్టెంట్లు కాదు 21 మంది అని ఇప్పటివరకు వార్తలు వచ్చాయి. కానీ ప్రస్తుతం వచ్చిన జాబితా ప్రకారం బిగ్బాస్6వ సీజన్లో పాల్గొనబోయేది 19 మంది కంటెస్టెంట్లు అని తెలుస్తోంది. 16 మంది సెలబ్రిటీలతోపాటు ఇద్దరు కామన్వ్యక్తులకు అవకాశం కల్పించారు. ప్రస్తుతం విడుదలైన ఈ లిస్ట్వైరల్గా మారింది.
శ్రీ సత్య, శ్రీహాన్, గీతు రాయల్, యాంకర్ నేహా చౌదరి, పాపులర్ యూ ట్యూబర్ఆది రెడ్డి, టీవీ9 యాంకర్ఆరోహి , ఇనయ సుల్తానా పేర్లు ఖరారు అయినట్లు తెలుస్తోంది. ఇంకా ఈ జాబితాలో నటుడు బాలాదిత్య, జబర్దస్త్ కమెడియన్ చలాకీ చంటి, ఆర్జే సూర్య, యాంకర్అండ్ హీరోయిన్ వాసంతి, వెన్నెల ఫేమ్కమెడియన్ షాని సాల్మాన్ పేర్లు వినిపిస్తున్నాయి. రియల్కపుల్స్అయిన సీరియల్నటీనటులు మెరిన్అండ్ రోహిత్, మోడల్ అండ్ శుక్ర మూవీ విలన్ విశాల్ రాజశేఖర్, నటి అభినయశ్రీ, సింగర్ రేవంత్తోపాటు మరో ఇద్దరు సామాన్యులు బిగ్బాస్ఆరో సీజన్లోకి అడుగుపెట్టనున్నారు. వీరంతా ప్రస్తుతం హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లోని హయత్ లో క్వారంటైన్ లో ఉన్నట్లు సమాచారం.
Next Story