Sat Dec 21 2024 00:17:23 GMT+0000 (Coordinated Universal Time)
BiggBoss 7 : బిగ్బాస్ కంటెస్టెంట్ తల్లిపై దాడి.. ఫ్యాన్ వార్సే కారణం..!
ఫ్యాన్ వార్స్ వల్ల బిగ్బాస్ కంటెస్టెంట్ తల్లిపై దారుణ దాడి. మొఖం పై తీవ్ర గాయాలతో..
BigBoss 7 : బిగ్బాస్ షోకి విశేషమైన ప్రేక్షకాదరణ ఉన్న సంగతి తెలిసిందే. హౌస్ లోకి కంటెస్టెంట్స్ గా ఎంట్రీ ఇచ్చిన వారికీ బయట అభిమానులు ఏర్పడుతుంటారు. ఇక గేమ్ లో భాగంగా హౌస్ లోని కంటెస్టెంట్స్ గొడవలు పడుతుంటే.. వారి మీద అభిమానంతో ఆడియన్స్ నెట్టింట ఫ్యాన్ వార్స్ చేస్తుంటారు. అయితే ఇప్పుడు ఈ ఫ్యాన్ వార్స్ కొంచెం శృతిమించినట్లు తెలుస్తుంది. ఏకంగా బిగ్బాస్ కంటెస్టెంట్ తల్లిపై దాడి చేసే స్థాయికి వెళ్లినట్లు కనిపిస్తుంది.
కాంట్రవర్సీలతో నిత్యం వార్తల్లో నిలిచే తమిళ నటి వనితా విజయ్ కుమార్ రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ లో చేసిన ఒక పోస్ట్ వైరల్ గా మారింది. ఆ పోస్టులో వనితా మొఖం పై తీవ్ర గాయాలు కనిపిస్తున్నాయి. ఇక ఆ పోస్టుకి వనితా ఇలా రాసుకొచ్చారు.. "ఎంతో ధైర్యంతో నా మీద జరిగిన దారుణ దాడి గురించి తెలియజేస్తున్నాను. బిగ్బాస్ అనేది కేవలం ఆట మాత్రమే. హింస అనేది కరెక్ట్ కాదు" అంటూ ఆమె రాసుకొచ్చారు.
వనితా కుమార్తె ‘జోవిక’ తమిళ బిగ్బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చారు. ఇక హౌస్ లో జోవిక మరియు ఇతర కంటెస్టెంట్ ప్రదీప్ మధ్య గొడవలు జరుగుతుంటాయి. దీంతో ఈ ఇరువురి ఫ్యాన్స్ మధ్య ఒక కోల్డ్ వార్ జరుగుతుంది. ఇక నటి వనితా తన కూతుర్ని సపోర్ట్ చేస్తూ పలు కామెంట్స్ చేస్తుంటారు. ఈ కామెంట్స్ వలనే ఆమె దాడిని ఎదుర్కొన్నట్లు పోస్టు చూస్తుంటే అర్ధమవుతుంది. ఇంతకీ అసలు ఈ దాడి చేసింది ఎవరు..? ఎందుకు చేశారు..? అనేది తెలియాల్సి ఉంది.
Next Story