Sat Dec 21 2024 03:07:16 GMT+0000 (Coordinated Universal Time)
రతిక, ప్రశాంత్ మధ్య ఇంత బాండింగ్ ఉందా..?
హౌస్ లో గొడవలు పడుతూ కనిపించిన రతిక, ప్రశాంత్ మధ్య ఈ రేంజ్ బాండింగ్ ఉందా..?
తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్బాస్ షోలోకి సెలబ్రిటీస్ తో పాటు జనరల్ ఆడియన్స్ కూడా ఎంట్రీ ఇస్తుంటారు. హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్స్ లో ఆల్రెడీ కొంతమందికి పరిచయం ఉంటుంది. మరికొంతమంది మాత్రం అక్కడే ఒకరిని ఒకరు పరిచయం చేసుకొని స్నేహితులు అవుతుంటారు. ఇక హౌస్ లో ఉన్నంత కాలం గేమ్ లో భాగంగా ప్రేమలు చూపించుకుంటారు, గొడవలు పడతారు.
అయితే హౌస్ లో గొడవలు పడిన వారిని చూసి.. బయటకి వచ్చిన తరువాత కూడా వాళ్ళు అలాగే ఉంటారేమో అని చాలామంది అనుకుంటారు. కానీ హౌస్ లో భద్ర శత్రువులుగా కనిపించిన కొందరు కంటెస్టెంట్స్.. బయట చాలా మంచి బాండింగ్ మెయిన్టైన్ చేస్తుంటారు. ఈక్రమంలోనే ఈ సీజన్ లోని రతిక, ప్రశాంత్ మధ్య కూడా మంచి బంధం కనిపిస్తుంది. హౌస్ లో వీరిద్దరి మధ్య జరిగిన లవ్ ట్రాక్ అందరికి తెలిసిందే.
బిగ్బాస్ లోకి ఎంట్రీ ఇవ్వడంతోనే వీరిద్దరూ లవ్ ట్రాక్ మొదలు పెట్టేశారు. ఒక వారం ప్రేమపావురాలు కనిపించిన వీరిద్దరూ.. సెకండ్ వీక్ లో శత్రువులుగా మారిపోయారు. ఎలిమినేషన్ కోసం ప్రశాంత్ ని రతిక నామినేట్ చేసి షాక్ ఇచ్చింది. ఇక ఆ తరువాత కొన్ని గొడవలు పడి మళ్ళీ కలుసుకున్నప్పటికీ ఫస్ట్ వీక్ లో కనిపించినట్లు కనిపించలేదు. కాగా లాస్ట్ వీక్ రతిక బయటకి వచ్చేసిన సంగతి అందరికి తెలిసిందే.
ఇక రతిక వెళ్లిపోవడంతో ప్రశాంత్ మిస్ అవుతున్నాను అంటూ రీసెంట్ ఎపిసోడ్ లో చెప్పడం, దాని గురించి రతిక మాట్లాడుతూ తన ఇన్స్టాలో.. 'నేను కూడా మిస్ అవుతున్నాను' అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టడం అందరిని షాక్ కి గురి చేస్తుంది. ఏంటి వీళ్లిద్దరి మధ్య ఇంత బాండింగ్ ఉందా..? అని కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ లాస్ట్ ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే.. రతిక గురించి ప్రశాంత్ అండ్ శివాజీ మాట్లాడుకున్నారు.
ప్రశాంత్ - అన్న నీకు రతిక గుర్తుకు వస్తుందా. నాకు రాత్రి తెగ గుర్తుకు వచ్చింది అన్న. నిద్ర పట్టలేదు
శివాజీ - నాకు గుర్తుకు వచ్చింది. కానీ ఏం చేస్తాంరా. తను చిన్న పిల్ల.
ప్రశాంత్ - అది చిన్న పిల్ల ఏంది అన్న బర్రె పిల్ల మస్త్ కోపం వస్తుంది అన్న.
శివాజీ - బయటకి వెళ్ళాక కలుదాంలేరా నువ్వు బాధ పడకు. నాకు అర్థమైంది నీ బాధ.
ప్రశాంత్ - రెండు మేక పోతులు తినిపించి చంపేస్తా అన్న దానిని. నా మీద ఎందుకు అన్న అంత కోపం తనకి. నేనేం చేసినా. నన్ను నామినేట్ చేసినా మన అమ్మాయి కదా అని మాట్లాడినా. కానీ తను నన్ను నమ్మలేదు.
శివాజీ - చిన్న పిల్లరా ఒదిలే.
ప్రశాంత్ - నన్ను కలవదు అన్న బయటకి పోయాక.
ఇక ఈ సంభాషణ అంతా రతిక తన ఇన్స్టా స్టోరీలో పోస్టు చేస్తూ.. 'ఇది చాలా బాగుంది. నేను కూడా మిమ్మల్ని మిస్ అవుతున్నా' అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట వైరల్ అవుతుంది.
Next Story