Mon Dec 23 2024 06:19:28 GMT+0000 (Coordinated Universal Time)
BiggBoss 7 : బిగ్బాస్ కంటెస్టెంట్స్ పై పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ దాడి..
అమర్ దీప్, అశ్విని శ్రీ, గీతూ రాయల్ పై దాడి చేసిన పల్లవి ప్రశాంత్ అభిమానులు.
BiggBoss 7 : తెలుగు బిగ్బాస్ సీజన్ 7 14 మంది కంటెస్టెంట్స్ తో మొదలయ్యి, ఐదో వారంలో మరో ఐదుగురు కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డు ఎంట్రీతో కొనసాగి ఆదివారం ముగిసింది. ఇక ఈ సీజన్ లో ఆల్మోస్ట్ ఆడియన్స్ కి తెలిసిన వారే హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వగా.. వీరిలో కామన్ మ్యాన్ గా ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచాడు. రన్నరప్ గా అమర్ డీప్ ఉన్నాడు. ఇక నిన్న ఫైనల్ ఎపిసోడ్ లో కావడంతో హైదరాబాద్ బిగ్బాస్ సెట్ ఉన్న అన్నపూర్ణ స్టూడియో వద్దకి కంటెస్టెంట్స్ కి చెందిన అభిమానులు చేరుకున్నారు.
పల్లవి ప్రశాంత్ ని విజేతగా ప్రకటించిన తరువాత అతడి ఫ్యాన్స్ స్టూడియో బయట విరంగా చేశారు. సంబరాలు చేస్తూ ఇతర కంటెస్టెంట్స్ పై దాడి చేశారు. హౌస్ లో ప్రశాంత్ తో పోటీ పడిన అమర్ దీప్.. స్టూడియో నుంచి కారులో బయటకి వస్తున్న సమయంలో ప్రశాంత్ ఫ్యాన్స్ అమర్ కారు అద్దాలను ధ్వంసం చేశారు. ఆ తరువాత కొద్దిసేపటికి మరో కంటెస్టెంట్ అశ్విని శ్రీ, గత సీజన్ కంటెస్టెంట్ గీతూ రాయల్ బయటకి రాగా.. వారి వాహనాలు పై కూడా దాడి చేశారు.
ఈ దాడిలో అమర్ దీప్ కుటుంబసభ్యులకు గాయం అయ్యినట్లు చెబుతున్నారు. ఇక తమ పై దాడి జరగడంతో అశ్విని శ్రీ, గీతూ రాయల్ ఆవేదన వ్యక్తం చేస్తూ.. తమ పై దాడికి పాల్పడిన వారిని పట్టిస్తే కాష్ ప్రైజ్ కూడా ఇస్తామంటూ ఆఫర్లు ప్రకటిస్తున్నారు. ఈ కంటెస్టెంట్స్ కారులతో పాటు పబ్లిక్ ప్రోపర్టీస్ పై కూడా దాడికి పాల్పడినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ దాడి పై పబ్లిక్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Next Story