Mon Dec 23 2024 01:52:17 GMT+0000 (Coordinated Universal Time)
Pallavi Prashanth : బిగ్బాస్ విజేత పల్లవి ప్రశాంత్ అరెస్ట్..
బిగ్బాస్ విజేత పల్లవి ప్రశాంత్ ని తన ఇంటి వద్దనే అరెస్ట్ చేసిన జూబ్లీ హిల్స్ పోలీసులు.
Pallavi Prashanth : తెలుగు బిగ్బాస్ 7 విన్నర్ గా టైటిల్ ని అందుకున్న పల్లవి ప్రశాంత్.. చుట్టూ వివాదం నడుస్తునా సంగతి తెలిసిందే. బిగ్బాస్ ఫైనల్ రోజున కొంతమంది పల్లవి ప్రశాంత్ అభిమానులు ఇతర బిగ్బాస్ కంటెస్టెంట్స్ అయిన అమర్ దీప్, అశ్విని శ్రీ, గీతూ రాయల్ పై దాడి చేయడం, ప్రభుత్వ ఆస్తులను కూడా ధ్వంసం చేయడం జరిగింది. దీంతో ఈ దాడికి కారణమైన పల్లవి ప్రశాంత్, అతడి తమ్ముడిని A1 A2 చేర్చి పలు సెక్షన్ల కింద జూబ్లీ హిల్స్ పోలీసులు కేసుని నమోదు చేశారు.
వీరిద్దరితో పాటు దాడిలో పాల్గొన్న అభిమానులను కూడా కేసులు నమోదు చేసి అరెస్టులు చేస్తున్నారు. ఈక్రమంలోనే నిన్న ఇద్దరి అభిమానులను అరెస్ట్ చేశారు. నేడు పల్లవి ప్రశాంత్ ని కూడా అరెస్ట్ చేశారు. ఈరోజు ఉదయం పల్లవి ప్రశాంత్ పరారీలో ఉన్నాడని, పోలీసులు గాలింపు చర్యలు మొదలు పెట్టారని వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఆ వార్తలను పల్లవి ప్రశాంత్ ఖండిస్తూ.. తాను ఇంటిలోనే ఉన్నానని, ఆ వార్తలని నమ్మొద్దని పేర్కొన్నాడు. తాజాగా ప్రశాంత్ ని అతని ఇంటి వద్దనే అరెస్ట్ చేశారట.
సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కొల్గూర్ గ్రామంలోని పల్లవి ప్రశాంత్ నివాసం వద్దనే తనని అరెస్ట్ చేసి.. జూబ్లీహిల్స్ పోలిస్ స్టేషన్కి తరలించారట. ఈ అరెస్ట్ తో ఈ గొడవ మరింత వైరల్ అవుతుంది. కాగా ఈ అరెస్ట్ గురించి పోలిసుల నుంచి వివరణ రావాల్సి ఉంది. మరి ఈ గొడవ ఇంకెంత దూరం వెళ్తుందో చూడాలి. మరో పక్క నాగార్జున ని కూడా అరెస్ట్ చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు అయ్యింది.అడ్వాకెట్ అరుణ్ నాగార్జునని తక్షణమే అరెస్టు చేయాలంటూ డిమాండ్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు.
Next Story