Sat Dec 21 2024 00:25:59 GMT+0000 (Coordinated Universal Time)
Pallavi Prashanth : నన్ను నెగిటివ్ చేస్తున్నారంటూ పల్లవి ప్రశాంత్ వీడియో..
నన్ను నెగిటివ్ చేస్తున్నారంటూ పల్లవి ప్రశాంత్ ఓ వీడియో రిలీజ్ చేశాడు.
Pallavi Prashanth : తెలుగు బిగ్బాస్ 7 విన్నర్ గా పల్లవి ప్రశాంత్ టైటిల్ ని అందుకున్నాడు. ఇక టైటిల్ అందుకున్న బిగ్బాస్ నుంచి బయటకి ప్రశాంత్ కి తన బహిమానులు ఘానా స్వగతం పలికారు. ఒక సినిమా స్టార్ కి వచ్చినంత జనసంద్రం పల్లవి ప్రశాంత్ ముందు కనిపించింది. అయితే ఈక్రమంలో కొంతమంది అభిమానులు ఇతర బిగ్బాస్ కంటెస్టెంట్స్ అయిన అమర్ దీప్, అశ్విని శ్రీ, గీతూ రాయల్ పై దాడి చేయడం, ప్రభుత్వ ఆస్తులను కూడా ధ్వంసం చేయడం జరిగింది.
దీంతో పల్లవి ప్రశాంత్ పై ప్రతి ఒక్కరు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. హైదరాబాద్ పోలీసులు అతడి పై, అతని అభిమానుల పై పలు సెక్షన్ల కింద కేసులు కూడా నమోదు చేశారు. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వీడియోలతో ఫేమస్ అయ్యి బిగ్బాస్ వరకు చేరుకున్న పల్లవి ప్రశాంత్.. టైటిల్ గెలుచుకున్న తరువాత మొదటి వీడియోని రిలీజ్ చేశాడు. ఆ వీడియోలో తనని కావాలనే నెగటివ్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.
ప్రశాంత్ కామెంట్స్..
"గెలిచినందుకు సంతోష పడాలా లేదా ఇలా కావాలనే నా పేరుని కొంతమంది పాడుచెయ్యాలని అనుకుంటున్నందుకు బాధ పడాలా అనేది తెలియడం లేదు. గెలిచిన నన్ను చూడడానికి నా ఊరు జనం, రెండు రాష్ట్రాల నుంచి వెయ్యకు మంది ప్రజలు వచ్చారు. ఒక 70 దాకా యూట్యూబ్ ఛానల్స్ కూడా వచ్చాయి. నన్ను అభిమానించి నా కోసం వచ్చిన వారిని బాధ పెట్టడం ఇష్టం లేక సాధ్యమైనంతవరకు ప్రతి ఒక్కరికి ఫోటో ఇచ్చాను. అప్పటికే చాలా సమయం అవ్వడం, ఓపిక లేదు, ఆకలి వేస్తుంది.
ఆహారం తిందాం అనుకుంటే.. 10 నిముషాలు ఇంటర్వ్యూ ఇవ్వండి, లేకుంటే మిమ్మల్ని నెగటివ్ చేస్తామంటూ యూట్యూబ్ ఛానల్స్, మీడియా వర్గాలు మాట్లాడాయి. ఒక రైతు బిడ్డ గెలవడం తప్పా అన్నా. నేను చేసిన తప్పు ఏంటి. ఒకవేళ నేను ఏదైనా తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించండి. కానీ నన్ను నెగటివ్ చేసి గెలిచాను అన్న సంతోషాన్ని నాశనం చేయకండి" అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
Next Story