Sat Dec 21 2024 00:25:54 GMT+0000 (Coordinated Universal Time)
Sivaji : నాగార్జున, చిరంజీవి వల్లే ఇలా ఉన్నాం.. బిగ్బాస్ శివాజీ భార్య కామెంట్స్..
నాగార్జున, చిరంజీవి వల్లే మేము ఇలా ఉన్నాం అంటూ బిగ్బాస్ శివాజీ భార్య చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
Sivaji : టాలీవుడ్ హీరో శివాజీ.. ఒక టీవీ ఛానల్ లో తన కెరీర్ ని స్టార్ట్ చేసి సీరియల్ లో నటుడిగా, సినిమాల్లో హీరోగా చేసే స్థాయికి ఎదిగారు. ప్రస్తుతం సినిమాలకి దూరంగా ఉంటూ పాలిటిక్స్ లో యాక్టీవ్ గా ఉంటున్న శివాజీ.. ఇటీవల బిగ్బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి అందర్నీ సర్ప్రైజ్ చేశారు. ఈ సీజన్ కంటెస్టెంట్స్ లోనే శివాజీ స్ట్రాంగెస్ట్ ప్లేయర్ గా ముందుకు కొనసాగుతూ వెళ్తున్నారు. తాజాగా దివాళీ సందర్బంగా కంటెస్టెంట్ ఫ్యామిలీ మెంబెర్స్ ని బిగ్బాస్ వేదిక పైకి నాగార్జున తీసుకు వచ్చారు.
ఈక్రమంలోనే శివాజీ భార్య శ్వేత, చిన్న కొడుకు రిక్కీ బిగ్బాస్ వేదిక పైకి వచ్చారు. ఇటీవల శివాజీ పెద్ద కొడుకు శ్రీని కూడా హౌస్ లోకి తీసుకు వచ్చి శివాజీని సర్ప్రైజ్ చేశారు. శివాజీ పెద్దకొడుకుతో ఆ ఎపిసోడ్ ఎమోషనల్ గా జరిగితే, చిన్నకొడుకుతో ఈ ఎపిసోడ్ చాలా ఫన్నీగా జరిగింది. రిక్కీ కంటెస్టెంట్స్ తో మాట్లాడుతూ.. భోలెని హీరో అనడం, శోభాని ఆంటీ అనడం, శివాజీకి సలహాలు ఇస్తే నాగార్జున కామెడీ చేయడంతో సరదాగా సాగింది.
ఇక ఈ వేదిక నుంచి శివాజీ తన భార్య శ్వేతని అందరికి పరిచయం చేశారు. ఆమె ఇప్పటి వరకు ఎవరికి తెలియదని పేర్కొన్నారు. ఇక శ్వేత మాట్లాడుతూ.. శివాజీ తనతో మాట్లాడకుండా అసలు ఉండలేరని, రోజులో ఒక్కసారైనా ఫోన్ ద్వారా అయినా మాట్లాడాల్సిందేనట. అలాంటిది బిగ్బాస్ కి వచ్చాక ఇన్నిరోజులు మాట్లాడకుండా ఉండరని పేర్కొన్నారు. ఆ తరువాత శ్వేత నాగార్జునతో మాట్లాడుతూ.. "మీరు, చిరంజీవి గారు వల్లే మేము ఇప్పుడు ఇలా ఉన్నాము. అది ఇప్పటికి గుర్తుకు ఉంది" అంటూ వ్యాఖ్యానించారు.
దానికి నాగార్జున రియాక్ట్ అవుతూ.. "దానికి కారణం నేను చిరంజీవి గారు కాదమ్మా. మీ ఆయన టాలెంట్" అంటూ చెప్పుకొచ్చారు. ఇక దీనికి శివాజీ రియాక్ట్ అవుతూ.. "ఇక్కడ చాలామందికి మీ గురించి తెలియదు సార్. మీరు ఎంతోమంది కొత్తవారిని ఆదరించారు, ప్రోత్సహించారు. ఈ అన్నపూర్ణ స్టూడియో ద్వారా ఎంతో మందికి అన్నం పెట్టడం నా కళ్ళతో చూశాను. ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉండొచ్చు గాని మంచితనం ఉండడం చాలా రేర్ అండి" అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
Next Story