Mon Dec 23 2024 01:30:33 GMT+0000 (Coordinated Universal Time)
Pallavi Prashanth : సెంట్రల్ జైలుకి పల్లవి ప్రశాంత్ తరలింపు..
పల్లవి ప్రశాంత్ ని అరెస్ట్ చేసిన పోలీసులు.. వెంటనే న్యాయమూర్తి ముందు హాజరుపరచడం, సెంట్రల్ జైలుకి తరలించడం జరిగిపోయింది.
Pallavi Prashanth : తెలుగు బిగ్బాస్ 7 విజేత పల్లవి ప్రశాంత్ ని నిన్న అరెస్ట్ చేసిన పోలీసులు.. వెంటనే న్యాయమూర్తి ముందు హాజరుపరచడం, జడ్జి రిమాండ్ విధించడం, ప్రశాంత్ ని సెంట్రల్ జైలుకి తరలించడం చక చక జరిగిపోయింది. బిగ్బాస్ ఫైనల్ రోజున పల్లవి ప్రశాంత్ హైదరాబాద్ రోడ్డులు పై ఊరేగింపుగా వెళ్లడం, లా అండ్ ఆర్డర్ వస్తుందని పోలీసులు చెప్పిన వినిపించుకోకుండా హంగామా చేయడం, అతడిని చూసి అతని అభిమానులు వీరంగం చేయడంతో.. ప్రైవేట్, పబ్లిక్ ఆస్థులు నాశనం అయ్యేలా చేసింది.
ఈక్రమంలో పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్.. ఇతర బిగ్బాస్ కంటెస్టెంట్స్ అయిన అమర్ దీప్, అశ్విని శ్రీ, గీతూ రాయల్ పై దాడి చేయడం, ప్రభుత్వ ఆస్థులు, ఆర్టీసీ బస్సుని ధ్వంసం చేయడం వంటివి చేశారు. ఇక ఈ మొత్తం గందరగోళానికి కారణమైన పల్లవి ప్రశాంత్, అతడి సోదరుడు రాజుని A1 A2 చేర్చి పలు సెక్షన్ల కింద జూబ్లీ హిల్స్ పోలీసులు కేసుని నమోదు చేశారు. వీరిద్దరితో పాటు దాడిలో పాల్గొన్న కొందరి అభిమానులపై కూడా కేసులు నమోదు చేసి అరెస్టులు చేస్తున్నారు.
ఈక్రమంలోనే మంగళవారం నాడు ఇద్దరి అభిమానులను అరెస్ట్ చేసిన పోలీసులు.. నిన్న బుధవారం రాత్రి పల్లవి ప్రశాంత్, సోదరుడు రాజుని కూడా అరెస్ట్ చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కొల్గూర్ గ్రామంలోని ప్రశాంత్, రాజుని తమ నివాసం వద్దనే అరెస్ట్ చేసి.. జూబ్లీహిల్స్ పోలిస్ స్టేషన్కి తరలించారు. వారిద్దర్నీ స్టేషన్ విచారించిన అనంతరం న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు.
న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించడంతో.. వారిద్దర్నీ హైదరాబాద్ చంచల్గూడ సెంట్రల్ జైలుకి తరలించారు. త్వరలోనే కస్టడీలో వారిద్దర్నీ పోలీసులు విచారించనున్నారు. మరో పక్క నాగార్జున ని కూడా అరెస్ట్ చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు అయ్యింది.అడ్వాకెట్ అరుణ్ నాగార్జునని తక్షణమే అరెస్టు చేయాలంటూ డిమాండ్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు.
Next Story