Mon Dec 23 2024 03:14:40 GMT+0000 (Coordinated Universal Time)
కొత్తగెటప్ లో బాలయ్య.. అభిమానులకు బిగ్గెస్ట్ సర్ ప్రైజ్
సీజన్ 1 సూపర్ సక్సెస్ కావడంతో.. త్వరలోనే అన్ స్టాపబుల్ 2 ను ప్రారంభించనున్నట్లు ఇప్పటికే ఆహా అధికారికంగా వెల్లడించింది.
గతేడాది నుంచి ఫుల్ ఫామ్ లో ఉన్నారు బాలయ్య. బాలయ్య కెరియర్ లోనే అఖండ బిగ్గెస్ట్ హిట్ అవ్వడం, ఆ తర్వాత అన్ స్టాపబుల్ అంటూ ఆహాలో సరికొత్త షో తో సెలబ్రిటీలను ఇంటర్వ్యూలు చేసి అభిమానులు, ప్రేక్షకులను అలరించారు. సినిమాల్లోనే కాకుండా.. ఇలా షో ద్వారా కూడా బాలయ్య బాబు ఎంటర్టైన్ మెంట్ ఇస్తుండటంతో అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యారు.
సీజన్ 1 సూపర్ సక్సెస్ కావడంతో.. త్వరలోనే అన్ స్టాపబుల్ 2 ను ప్రారంభించనున్నట్లు ఇప్పటికే ఆహా అధికారికంగా వెల్లడించింది. అయితే ఇది ఎప్పట్నుంచి ఆరంభమవుతుందన్న విషయాన్ని చెప్పలేదు. ఇటీవల అన్ స్టాపబుల్ 2 సాంగ్ నీ విడుదల చేసింది. తాజాగా బాలయ్య గెటప్, సీజన్ 2 ట్రైలర్ పై ఆహా ఇంట్రస్టింగ్ అప్డేట్ ఇచ్చింది. ఆహా నుంచి బాలయ్య బాబు తరపున మరో బిగ్గెస్ట్ సర్ప్రైజ్ రాబోతుంది అని ప్రకటించారు ఆహా ఓటీటీ నిర్వాహకులు. ఫేస్ చూపించలేదు కానీ.. సరికొత్త టోపీ ధరించి వెనక నుంచి బాలకృష్ణ ఫోటోని ఆహా నిర్వాకులు పోస్ట్ చేసి.. "నందమూరి బాలకృష్ణ ఈ సంవత్సరంలో అతిపెద్ద ఆశ్చర్యంతో మునుపెన్నడూ చూడని అవతారంలోకి వచ్చారు. అత్యంత క్రేజీ ట్రైలర్ మరో 4 రోజుల్లో ఆహాలో రాబోతుంది" అని ట్వీట్ చేశారు. అక్టోబర్ 4న ఈ ట్రైలర్ ను విడుదల చేయనున్నారు.
Next Story