Mon Dec 23 2024 05:17:28 GMT+0000 (Coordinated Universal Time)
ఓటీటీలో బింబిసార, సీతారామం సినిమాల విడుదల ఎప్పుడంటే..?
శనివారం, ఆదివారం షోలకు సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ బాగా ఉన్నాయని
బింబిసార, సీతారామం సినిమాలు మంచి కలెక్షన్స్ ను సొంతం చేసుకుంటూ వస్తున్నాయి. హిట్ టాక్ తో మంచి ఆక్యుపెన్సీతో సినిమాలు రన్ అవుతున్నాయి. శనివారం, ఆదివారం షోలకు సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ బాగా ఉన్నాయని అంటున్నారు. ఇక బింబిసార, సీతారామం సినిమాల ఓటీటీల రిలీజ్ డేట్ లకు సంబంధించిన చర్చ కూడా కొనసాగుతూ ఉంది. అయితే బింబిసార, సీతారామం సినిమాల ఓటీటీ రిలీజ్ మరీ తొందరగా అయితే ఉండవు. ఈ రెండు సినిమాలు థియేటర్లో చూడాల్సిన సినిమాలు. బింబిసార, సీతారామం సినిమాలు మంచి బడ్జెట్, అందమైన లొకేషన్స్ తో నిండి.. చాలా గ్రాండ్ గా తెరకెక్కించిన సినిమాలు కావడంతో సినీ అభిమానులు దీన్ని ఓటీటీలో చూద్దామనే ఆప్షన్ పెట్టుకోవడం లేదు.
సీతారామం సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. మినిమమ్ ఆరు వారాల తర్వాత కానీ.. ఆ తర్వాత కానీ సినిమా అందుబాటులో ఉండే అవకాశం ఉంది. దుల్కర్ సల్మాన్ – మృణాల్ ఠాకూర్ జంటగా వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ నిర్మించిన ప్రతిష్టాత్మక చిత్రం 'సీతారామం'. సుమంత్, రష్మిక మందన కీలక పాత్ర పోషించారు. హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా క్లాస్ గా ఉంది.
ఇక బింబిసార సినిమా మాస్ సర్క్యూట్స్ లో మంచి కలెక్షన్స్ ను సొంతం చేసుకుంటూ ఉంది. బింబిసార సినిమా ఓటీటీ విడుదలపై చిత్ర బృందం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. వీలైనంత ఎక్కువ రోజులు థియేటర్లోనే సినిమాను కొనసాగించాలని.. 8 వారాల తర్వాత ఈ సినిమా ఓటీటీలో వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. నందమూరి కల్యాణ్రామ్ టైటిల్ రోల్ పోషించిన సినిమా బింబిసార. వశిష్ఠ్ దర్శకత్వం వహించాడు.
Next Story