Mon Dec 23 2024 06:23:29 GMT+0000 (Coordinated Universal Time)
"బింబిసార" స్ట్రీమింగ్ హక్కులు సొంతం చేసుకున్న జీ5.. త్వరలోనే స్ట్రీమింగ్ !
"బింబిసార" సినిమా ఓటీటీలో ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూసేవారి సంఖ్య కాస్త ఎక్కువగానే ఉంది. రెండు వేర్వేరు కాలాల్లో..
కల్యాణ్ రామ్ హీరోగా వశిష్ట దర్శకత్వంలో రూపొందిన సినిమా బింబిసార. ఆగస్టు 5న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకుంది. అదేరోజు విడుదలైన సీతారామం, ఆ తర్వాతి వారం విడుదలైన కార్తికేయ 2 పోటీని తట్టుకుని ఈ సినిమా నిలబడటం విశేషం. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను 'జీ 5' వారు సొంతం చేసుకున్నట్టుగా చెబుతున్నారు. కొత్తగా వచ్చిన నిబంధనల ప్రకారం సినిమా విడుదలైన 50 రోజుల తర్వాతే ఈ సినిమా జీ5లో స్ట్రీమింగ్ కానుంది.
"బింబిసార" సినిమా ఓటీటీలో ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూసేవారి సంఖ్య కాస్త ఎక్కువగానే ఉంది. రెండు వేర్వేరు కాలాల్లో ఒక నిధిని ఒకేసమయంలో తెరిచేందుకు జరిగే ప్రయత్నమే సినిమాలో హైలెట్ గా నిలిచింది. కథా కథనాలు, విజువల్స్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్ గా నిలిచాయి. త్వరలోనే బింబిసార ను హిందీలోనూ విడుదల చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాగా.. కార్తికేయ 2 కూడా జీ5లోనే విడుదల కానుంది. బింబిసార స్ట్రీమింగ్ మొదలైన వారం లేదా 10 రోజుల్లో కార్తికేయ 2 కూడా విడుదల కావచ్చని తెలుస్తోంది.
Next Story