Mon Dec 23 2024 06:48:09 GMT+0000 (Coordinated Universal Time)
ఇంప్రెసివ్ గా.. 'బింబిసార' ట్రైలర్
కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న సోషియో ఫాంటసీ చిత్రం 'బింబిసార'.
కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న సోషియో ఫాంటసీ చిత్రం 'బింబిసార'. కేథరిన్, సంయుక్త మీనన్ కథానాయికలుగా నటించిన ఈ సినిమా, ఆగస్టు 5వ తేదీన విడుదల చేయనున్నారు. ప్రకాశ్ రాజ్, వెన్నెల కిశోర్ ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. తన సొంత బ్యానర్లో కళ్యాణ్ రామ్ నిర్మించిన ఈ సినిమాకి మల్లిడి వశిష్ఠ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకి చిరంతన్ భట్ స్వరాలను సమకూర్చగా, నేపథ్య సంగీతాన్ని కీరవాణి అందించారు.
'118'తో హిట్ అందుకున్నాడు కళ్యాణ్ రామ్. ఆ తర్వాత వస్తున్న సినిమా 'బింబిసార'. చిత్రం నుండి విడుదలైన పోస్టర్లకు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. తాజాగా విడుదలైన బింబిసార ట్రైలర్ కూడా ఇంప్రెసివ్ గా కనిపిస్తోంది. ఈ రోజు సాయంత్రం 5:09 నిమిషాలకు ట్రైలర్ ను రిలీజ్ చేశారు. రెండు కాలాల్లో కథ నడుస్తుందనే విషయం ట్రైలర్ ను బట్టి అర్థమవుతోంది. మగధ సామ్రాజ్యాన్ని పాలించిన రాజు బింబిసారుడు పాత్రలో కళ్యాణ్ రామ్ అద్భుతంగా నటించారు. కొన్ని కారణాల వలన ఆధునిక ప్రపంచంలోకి అడుగుపెట్టాల్సి వస్తుంది. ఆ తర్వాత చోటు చేసుకున్న ఘటనలే ఈ సినిమాలో చూపించబోతూ ఉన్నారు.
Next Story