Mon Dec 23 2024 07:06:21 GMT+0000 (Coordinated Universal Time)
ఓటీటీలోకి బింబిసార ?
కీరవాణి అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదనపు బలంగా నిలిచింది. బింబిసార 50 రోజులు పూర్తిచేసుకోవడంతో..
నందమూరి కల్యాణ్ రామ్ డ్యూయల్ రోల్ లో తెరకెక్కిన సినిమా బింబిసార. కల్యాణ్ రామ్ సొంత బ్యానర్లో నిర్మించిన ఈ సినిమాకు శ్రీ వశిష్ఠ దర్శకత్వం వహించాడు. ఆగస్టు 5న విడుదలైన ఈ సినిమా.. ఊహించని విజయాన్ని అందుకుని.. 50 రోజుల థియేట్రికల్ రన్ ను పూర్తి చేసుకుంది. కల్యాణ్ రామ్ సినీ కెరియర్లో అత్యధిక వసూళ్లు చేసిన సినిమాగా బింబిసార రికార్డు సృష్టించింది. చారిత్రక నేపథ్యం .. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ ఈ సినిమాను కొత్తగా ఆవిష్కరించాయి. బలమైన ఎమోషన్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది.
కీరవాణి అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదనపు బలంగా నిలిచింది. బింబిసార 50 రోజులు పూర్తిచేసుకోవడంతో.. ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. బింబిసార ఓటీటీ రైట్స్ ను జీ5 దక్కించుకున్నట్లు గతంలో వార్తలొచ్చాయి. తాజాగా ఈ సినిమాను జీ5లో అక్టోబర్ 7వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. థియేటర్లో సందడి చేసిన బింబిసారుడు.. ఓటీటీ ప్రేక్షకులను మెప్పిస్తాడో లేదో చూడాలి.
Next Story