Mon Dec 23 2024 04:20:26 GMT+0000 (Coordinated Universal Time)
'బింబిసార', 'సీతారామం' చిత్రాలు హిట్ అవ్వడంపై ఆ యంగ్ హీరో ఫుల్ ఖుష్
ఇవాళ ఉదయమే కల్యాణ్‌రామ్ బింబిసారతోపాటు నా ఫ్రెండ్స్ సుమంత్, దుల్కర్ సల్మాన్
'బింబిసార', 'సీతారామం' చిత్రాలు ఈరోజు విడుదలయ్యాయి. ఈ రెండు సినిమాలు మంచి టాక్ తెచ్చుకున్నాయి. ఈ రెండు చిత్రాలు హిట్ కావడంపై హీరో అడివి శేష్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. కళ్యాణ్ రామ్ నటించిన 'బింబిసార', తన స్కేహితులు దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, సుమంత్ నటించిన 'సీతారామం' బాగున్నాయంటూ బ్లాక్ బస్టర్ టాక్ వినిపిస్తోందని అన్నారు. ఇండస్ట్రీకి ఇది కదా కావాల్సింది అని చెప్పారు. ఈ చిత్రాలు హిట్ కావడం సంతోషంగా ఉందని అన్నారు. కరోనా వచ్చి ప్రస్తుతం తాను ఐసొలేషన్ లో ఉన్నానని... అందుకే తాను థియేటర్లకు వచ్చి సినిమాలు చూడలేకపోతున్నానని అన్నారు. తన కోసం మార్నింగ్ షోలో ఒక సినిమా, మ్యాట్నీలో మరో సినిమా కుమ్మేయండి అంటూ అభిమానులకు సూచించారు.
"ఇవాళ ఉదయమే కల్యాణ్‌రామ్ బింబిసారతోపాటు నా ఫ్రెండ్స్ సుమంత్, దుల్కర్ సల్మాన్, మృనాల్ నటించిన సీతా రామం బ్లాక్‌బస్టర్ టాక్ విన్నాను. ఇది కదా కావాల్సింది. కొవిడ్ వచ్చి ఐసోలేషన్‌లో ఉన్నా. నా కోసం మార్నింగ్ షో ఒక సినిమా.. మ్యాటినీ ఒక సినిమా కుమ్మేయండి" అని ట్వీట్ చేశారు అడివి శేష్.
Next Story