Mon Dec 23 2024 09:52:32 GMT+0000 (Coordinated Universal Time)
ఓటీటీలోకి వచ్చేసిన 2018.. షాకిచ్చిన థియేటర్స్ ఓనర్లు
ఈ చిత్రం 2018లో కేరళలో సంభవించిన వరదల చుట్టూ తిరుగుతుంది. ఈ చిత్రం ప్రస్తుతం ఓటీటీలో అందుబాటులోకి వచ్చేసింది.
2018 సినిమా మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ ను దక్కించుకుంది. మలయాళంలో ఇప్పటి వరకే మరే సినిమాకు సాధ్యం కానీ రీతిలో రూ.170 కోట్ల మేరకు కలెక్షన్స్ సాధించి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. తెలుగులోనూ సినిమాకు మంచి వసూళ్లు వస్తున్నాయి. ఇప్పటికే దాదాపు రూ.11 కోట్ల మేరకు గ్రాస్ కలెక్షన్స్ను సాధించింది. గీతాఆర్ట్స్ బ్యానర్పై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని ప్రేక్షకులకు అందించారు.
ఈ చిత్రం 2018లో కేరళలో సంభవించిన వరదల చుట్టూ తిరుగుతుంది. ఈ చిత్రం ప్రస్తుతం ఓటీటీలో అందుబాటులోకి వచ్చేసింది. జూన్ 7న ఓటీటీలో రిలీజ్ చేయాలని సినిమా విడుదలకు ముందే డీల్ కుదుర్చుకున్నారు. దీనిపై కేరళలో థియేటర్స్ యాజమాన్యాలు అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నాయి. సినిమా విడుదలైన ఐదారు వారాల్లోనే ఓటీటీలో విడుదల చేయటం సరికాదని.. ఇలా చేయటం వల్ల థియేటర్స్కు దాదాపు రూ.200 కోట్ల మేరకు నష్టం వస్తాయని అంటున్నారు. జూన్ 7, 8వ తేదీల్లో థియేటర్స్ సమ్మెకు పిలుపునిచ్చారు. “2018” సినిమాకు జూడ్ ఆంథనీ జోసెఫ్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో టోవినో థామస్, ఇంద్రన్స్, కుంచాకో బోబన్, అపర్ణ బాలమురళి, వినీత్ శ్రీనివాసన్, ఆసిఫ్ అలీ, లాల్, నరేన్, తన్వి రామ్ తదితరులు నటించారు.
ఈ చిత్రం దాని థ్రిల్లింగ్ కథనంతో ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా.. వినాశకరమైన వరదల కారణంగా ఎంతో మంది జీవితాలు ప్రభావితమయ్యాయనే విషయాన్ని తెలియజేస్తుంది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు. ప్రతిభావంతులైన తారాగణం, ఆకట్టుకునే కథాంశంతో, ఈ చిత్రం మలయాళ పరిశ్రమలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమాను మలయాళం, తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో సోనీ లివ్ యాప్ లో చూడవచ్చు.
Next Story