Tue Dec 24 2024 01:57:23 GMT+0000 (Coordinated Universal Time)
HariHara VeeraMallu : పవన్ కళ్యాణ్ మూవీ డైలాగ్ లీక్ చేసిన బాబీ డియోల్..
పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు' మూవీ నుంచి డైలాగ్ లీక్ చేసిన బాలీవుడ్ నటుడు బాబీ డియోల్.
HariHara VeeraMallu : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం ఒక వారియర్ గా నటిస్తూ చేస్తున్న చిత్రం 'హరిహర వీరమల్లు'. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ షూటింగ్ కి ప్రస్తుతం బ్రేక్లు పడ్డాయి. పవన్ ఎలక్షన్స్ కి సిద్ధమయ్యే బిజీలో ఉండడంతో.. ఈ మూవీ షూటింగ్ కి గ్యాప్ ఇచ్చారు. ఎన్నికల హడావుడి అంతా పూర్తి అయిన తరువాతే ఈ సినిమా మళ్ళీ పట్టాలు ఎక్కనుందని తెలుస్తుంది.
కాగా ఈ సినిమాలో పవన్ కి జోడిగా నిధి అగర్వాల్ నటిస్తుండగా బాలీవుడ్ తారలు బాబీ డియోల్, నోరా ఫతేహి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. బాబీ డియోల్ రీసెంట్ గా సందీప్ వంగా డైరెక్ట్ చేసిన 'యానిమల్' మూవీలో విలన్ గా నటించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సోమవారం హైదరాబాద్ లో జరిగింది. ఇక ఈ కార్యక్రమంలో బాబీ డియోల్.. హరిహర వీరమల్లు సినిమాలోని ఒక డైలాగ్ ని లీక్ చేశారు.
"నేను తెలుగులో ఒక సినిమా చేస్తున్నాను. ఆ మూవీలోని ఒక డైలాగ్ నాకు గుర్తుకు ఉంది. అది నేను చెప్పాలి అనుకుంటున్నాను. 'పాశ్యాబేగం మా ప్రాణం. ఆ ప్రాణం నువ్వు కాపాడావు. నీకు ఏం కావాలో కోరుకోమని నేను ఆదేశిస్తున్నాను' అనేది నా డైలాగ్" అంటూ చెప్పుకొచ్చారు. ఈ డైలాగ్ పవన్ తో చెప్పేది అని అర్ధమవుతుంది. ప్రస్తుతం ఈ డైలాగ్ కి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
ఇక వీరమల్లు షూటింగ్ విషయానికి వస్తే.. దాదాపు 60 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. మిగితా బ్యాలన్స్ షూట్ ఎప్పుడు పూర్తి చేసుకొని థియేటర్స్ లోకి వస్తుందా అని అభిమానులంతా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. పవన్ మొదటిసారి ఒక వారియర్ గా నటిస్తున్న సినిమా కావడంతో అభిమానులు భారీ అంచనాలే నెలకొన్నాయి. ఏఎం రత్నం నిర్మిస్తున్న ఈ సినిమాకి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
Next Story