Mon Dec 23 2024 08:07:43 GMT+0000 (Coordinated Universal Time)
ప్రముఖ బాలీవుడ్ కపుల్ కు కరోనా పాజిటివ్ !
ప్రముఖ బాలీవుడ్ కపుల్ కు కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయింది. బాలీవుడ్ హీరో జాన్ అబ్రహాం, ఆయన భార్య
సినీ ఇండస్ట్రీని మళ్లీ కరోనా చుట్టు ముడుతోంది. తాజాగా ప్రముఖ బాలీవుడ్ కపుల్ కు కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయింది. బాలీవుడ్ హీరో జాన్ అబ్రహాం, ఆయన భార్య ప్రియా రంచాల్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని జాన్ అబ్రహాం తన ఇన్ స్టా ఖాతా ద్వారా వెల్లడించారు.
మూడ్రోజుల క్రితం తానొక వ్యక్తిని కలిశానని, అతనికి కరోనా ఉందన్న విషయం ఆలస్యంగా తెలిసిందని జాన్ పేర్కొన్నారు. ఆ వ్యక్తికి కరోనా ఉందని తెలిశాక.. తాను, తన భార్య కోవిడ్ పరీక్షలు చేయించుకోగా.. పాజిటివ్ గా నిర్థారణ అయిందన్నారు. కాగా.. ప్రస్తుతం తాము ఇంట్లోనే క్వారంటైన్ అయ్యామని జాన్ వివరించారు. రెండు డోసుల వ్యాక్సిన్ ను తీసుకున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని, మాస్క్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు.
Next Story