Fri Jan 03 2025 03:09:00 GMT+0000 (Coordinated Universal Time)
తీవ్ర విషాదం.. సీనియర్ నటుడు కన్నుమూత
సీనియర్ నటుడు రియో కపాడియా కన్నుమూశారు
బాలీవుడ్ సీనియర్ నటుడు రియో కపాడియా కన్నుమూశారు. ఎన్నో హిట్ సినిమాల్లో నటించిన రియో కపాడియా క్యాన్సర్ మహమ్మారితో పోరాడుతూ గురువారం (సెప్టెంబర్ 14) తుది శ్వాస విడిచారు. సినిమాలతోపాటు ఓటీటీల్లో పలు వెబ్ సిరీస్ లలోనూ నటించారు.
రియో కపాడియా ఇక లేరు. 'చక్ దే! ఇండియా,' 'హ్యాపీ న్యూ ఇయర్', 'మర్దానీ' సినిమాలలో నటించి మెప్పించారు. అతని స్నేహితుడు ఫైసల్ మాలిక్ రియో మరణ వార్తను ధృవీకరించారు. రియో కపాడియా దహన సంస్కారాలు సెప్టెంబర్ 15న గోరేగావ్‌లోని శివ్ ధామ్ స్మశానవాటిక లో నిర్వహించనున్నారు. నటుడికి అతని భార్య ఫరా, పిల్లలు అమన్, వీర్ ఉన్నారు. చాలా కాలంగా రియో క్యాన్సర్ తో బాధపడుతున్నారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చిన మేడిన్ హెవెన్ సీజన్ 2లోనూ నటించాడు. ఇందులో మృణాల్ ఠాకూర్ తండ్రి పాత్రలో రియో కపాడియా కనిపించారు. సిద్ధార్థ్ తివారీ మహాభారత్ లో గాంధారి తండ్రి పాత్రలో నటించారు. సిటీ ఆఫ్ డ్రీమ్స్, ది టెస్ట్ కేస్ లాంటి వెబ్ సిరీస్ లలోనూ రియో కపాడియా కనిపించారు.
Next Story