Mon Dec 23 2024 02:54:18 GMT+0000 (Coordinated Universal Time)
పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన బిపాషాబసు
పెళ్లి తర్వాత పెద్దగా సక్సెస్ ను అందుకోలేకపోయింది బిపాషా. ఈ మధ్యకాలంలో సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చిన బిపాషా, తాజాగా తన..
బాలీవుడ్ లో బ్లాక్ బ్యూటీగా పేరొంది.. తన అందచందాలతో యావత్ కుర్రకారుకు నిద్రలేకుండా చేసిన బ్యూటీ బిపాషా బసు. అందాల ఆరబోతలతో పాటు.. ఘాటైన లిప్ లాక్ ల వరకూ.. ఏ విషయంలోనూ తగ్గేదే లే అంటూ.. దూసుకెళ్లిన బిపాషా.. సినిమా కెరీర్లో సక్సెస్ అయింది. ఇక తన ప్రియుడు, నటుడు కరణ్ గ్రోవర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న బిపాషా అడపాదడపా సినిమాలు చేస్తూ వచ్చింది. కానీ పెళ్లి తరువాత అంతగా సక్సెస్‌ను అందుకోలేకపోయింది.
పెళ్లి తర్వాత పెద్దగా సక్సెస్ ను అందుకోలేకపోయింది బిపాషా. ఈ మధ్యకాలంలో సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చిన బిపాషా, తాజాగా తన అభిమాలనుకు గుడ్ న్యూస్ చెప్పింది. తమ కుటుంబంలో సభ్యుల సంఖ్య పెరిగిందని.. దేవీమా అనుగ్రహంతో తమకు పండంటి ఆడబిడ్డ జన్మించిందని కొద్దిసేపటి క్రితమే బిపాషా తన సోషల్ అకౌంట్లో పోస్ట్ చేసింది. బిపాషా తల్లి కావడంతో ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రులుగా తమ జీవితంలో మరో మెట్టు పైకి ఎక్కిన బిపాషా, కరణ్ గ్రోవర్‌లకు పలువురు బాలీవుడ్ స్టార్స్ విషెస్ చెబుతున్నారు.
Next Story