Thu Apr 03 2025 09:34:38 GMT+0000 (Coordinated Universal Time)
కంగనా హాట్ కామెంట్స్.. ఈ సారి మోడీపై గురి
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆమె తాజాగా ట్వీట్ చేశారు. ఈ దేశానికి నియంతృత్వం అవసరమని కంగనా అభిప్రాయపడ్డారు. రైతు చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెనక్కు తీసుకోవడాన్ని ఆమె తప్పు పట్టారు. ఆందోళనలకు తలవంచాల్సిన అవసరం ఏముందని కంగనా రనైత్ ప్రశ్నించారు.
నియంతృత్వమే కరెక్ట్...
నిద్రావస్థలో ఉన్న దేశానికి నియంతృత్వమే కరెక్ట్ అని కంగనా అభిప్రాయపడింది. రోడ్డెక్కి ప్రతి ఒక్కరూ నిరసన తెలుపుతుంటే మరో జీహాదీగా మారుతుందని కంగనా సంచలన వ్యాఖ్యలు చేసింది. పార్లమెంటులో చేయాల్సిన చట్టాలు రోడ్డు మీద చేయడమేంటని కంగనా రనౌత్ నిలదీశారు. కంగనా కామెంట్స్ పై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Next Story