Mon Dec 23 2024 07:26:04 GMT+0000 (Coordinated Universal Time)
Malaika Arora బ్రేకింగ్:ఆరో అంతస్తు నుంచి దూకేసిన బాలీవుడ్ నటి తండ్రి
బాలీవుడ్ భామ మలైకా అరోరా తండ్రి అనిల్ అరోరా
బాలీవుడ్ భామ మలైకా అరోరా తండ్రి అనిల్ అరోరా బిల్డింగ్ ఆరో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. బాంద్రా పోలీసులు, క్రైమ్ బ్రాంచ్ బృందం ఘటనా స్థలానికి చేరుకుంది. ప్రస్తుతం పోలీసులకు ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదు. మలైకా తండ్రి చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారని ప్రచారం జరుగుతోంది.
మలైకా తల్లిదండ్రులు జాయిస్ పాలికార్ప్, అనిల్ అరోరా మలైకా 11 సంవత్సరాల వయస్సులో విడిపోయారు. ఫిలింఫేర్కి గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో మలైకా అరోరా తన తల్లిదండ్రులతో తన సంబంధాన్ని గురించి పంచుకుంది. తల్లిదండ్రులు విడిపోయిన సమయంలో తన చెల్లెలి వయసు 6 సంవత్సరాలని తెలిపింది. తల్లిదండ్రులు విడిపోయిన ఘటన తనపైనా, అమృతపై తీవ్ర ప్రభావం చూపిందని పంచుకుంది.
Next Story