Mon Dec 23 2024 08:09:54 GMT+0000 (Coordinated Universal Time)
ప్రేమికుల రోజు భర్త నుంచి విడాకులు తీసుకున్న నటి
ప్రియమైన అభిమానులు, శ్రేయోభిలాషులకు... నేను, రితేశ్ విడిపోవాలని నిర్ణయించుకున్నాం. బిగ్ బాస్ షో తర్వాత చాలా
బాలీవుడ్ ఐటెం సాంగ్స్ భామ రాఖీ సావంత్ షాకింగ్ న్యూస్ వెల్లడించింది. భర్త రితేష్ నుంచి విడిపోతున్నట్లు ప్రకటించింది. అయితే.. ప్రేమికుల రోజున రాఖీ సావంత్ తన విడాకుల విషయాన్ని ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. హిందీ బిగ్ బాస్ రియాల్టీ షో లో పాల్గొన్న రాఖీ సావంత్.. ఈ షో తర్వాతా తన వ్యక్తిగత జీవితంలో చాలా పరిణామాలు జరిగాయని పేర్కొంది.
Also Read : తీవ్ర విషాదం.. సాంబార్ లో పడి చిన్నారి మృతి
"ప్రియమైన అభిమానులు, శ్రేయోభిలాషులకు... నేను, రితేశ్ విడిపోవాలని నిర్ణయించుకున్నాం. బిగ్ బాస్ షో తర్వాత చాలా ఘటనలు జరిగాయి. వాటిలో కొన్ని నేను నియంత్రించలేనివి. సమస్యలను పరిష్కరించుకునేందుకు నేను, రితేశ్ చాలా చర్చించాం. కానీ సాధ్యపడలేదు. అందుకే ఇకపై ఎవరి జీవితం వాళ్లదే అని నిర్ణయించుకున్నాం. కలిసుండి కొట్టుకునే కంటే.. విడిపోయి సంతోషంగా బతకాలని భావిస్తున్నాం" అంటూ రాఖీ సోషల్ మీడియాలో ఓ ప్రకటన చేసింది.
Also Read : ఏపీలో నైట్ కర్ఫ్యూ ఎత్తివేత
ఈ పోస్ట్ పై నెటిజన్లు పలురకాలుగా స్పందిస్తున్నారు. కొందరు బిగ్ బాస్ ను తప్పుపడుతుండగా.. మరికొందరు మరొక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు. కాగా.. ఇటీవలే తెలుగు బిగ్ బాస్ సీజన్ ముగిసిన అనంతరం ఇంచుమించు ఇలాంటి ఘటనే జరిగింది. హౌస్ నుంచి బయటికి వచ్చాక దీప్తి సునయన షన్నూకి బ్రేకప్ చెప్పింది. దాంతో షన్నూ - సిరిలు హౌస్ లో క్లోజ్ గా ఉండటమే వారిద్దరి బ్రేకప్ కు కారణమని కామెంట్లు చేశారు నెటిజన్లు.
Next Story