Mon Dec 23 2024 19:20:48 GMT+0000 (Coordinated Universal Time)
Ratan Tata Simi Garewal: మీకు ఈ విషయంలో తెలుసా? ఆమెతో రతన్ టాటా ఒకప్పుడు రిలేషన్ షిప్
వ్యాపార దిగ్గజం రతన్ టాటా 86 సంవత్సరాల వయసులో
వ్యాపార దిగ్గజం రతన్ టాటా 86 సంవత్సరాల వయసులో వృద్ధాప్య సంబంధిత వ్యాధులతో కన్నుమూశారు. ప్రపంచానికి ఆయన వ్యక్తిగత జీవితం గురించి పెద్దగా తెలియదు. ఆయన ఒకప్పుడు సిమి గారేవాల్తో రొమాంటిక్ రిలేషన్షిప్లో ఉన్నారనే విషయం చాలా మందికి తెలియదు. తన గతాన్ని తలచుకుంటూ ఆమె ప్రఖ్యాత పారిశ్రామికవేత్త రతన్ టాటాతో తనకు ఉన్న ప్రత్యేక సంబంధాన్ని గుర్తుచేసుకున్నారు.
సిమి గారేవాల్ బాలీవుడ్ లో నటిగా మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. మేరా నామ్ జోకర్, కర్జ్, చల్తే చల్తే వంటి ప్రముఖ చిత్రాలలో నటించారు. అంతేకాకుండా 'రెండెజౌస్ విత్ సిమి గరేవాల్' అనే టాక్ షో ద్వారా దేశ ప్రజలకు బాగా దగ్గరయ్యారు. తనకు రతన్ టాటాకు ఉన్న అనుబంధం గురించి కూడా ఆమె మాట్లాడారు. రతన్ టాటా ఓ సంపూర్ణ వ్యక్తి అంటూ ప్రశంసించింది. తమ మధ్య దీర్ఘకాల అనుబంధం ఉందని కూడా తెలిపారు. ఆయన్ను పరిపూర్ణమైన వ్యక్తిగా అభివర్ణించింది. ఆయనలో ఉన్న లక్షణాల కారణంగా ఆయన చాలా ఉన్నతంగా అనిపించేవాడని సిమి బయటపెట్టారు. ఆయన డబ్బుకు అసలు విలువ ఇచ్చేవారు కాదని కూడా అన్నారు.
Next Story