Thu Dec 26 2024 15:20:28 GMT+0000 (Coordinated Universal Time)
రహస్యంగా ఎంగేజ్మెంట్ చేసుకున్న హీరోయిన్
ఈ రోజు నాకు ఒక గొప్ప రోజు. ఎప్పటి నుంచో నాకున్న ఒక పెద్ద కల త్వరలో నెరవేరబోతోంది. ఇది జరిగిందంటే ఇప్పటికీ..
ముంబై : బాలీవుడ్ హీరోయిన్ రహస్యంగా ఎంగేజ్మెంట్ చేసుకుంది. ఈ విషయం తాజాగా ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫొటోలను బట్టి అర్థమవుతోంది. బాలీవుడ్ ముద్దుగుమ్మ, సీనియర్ నటుడు శతృఘ్నసిన్హా కూతురు సోనాక్షి సిన్హా సీక్రెట్ గా నిశ్చితార్థం చేసుకున్నట్లు తెలుస్తోంది. సోనాక్షి నిన్న తన చేతికి డైమండ్ రింగ్ తొడికి ఉన్న ఫొటోలు.. పక్కన కనిపించీ.. కనిపించకుండా ఉన్న వ్యక్తితో దిగిన ఫొటోలను నెటిజన్లతో పంచుకుంది. తన ప్రియుడి ముఖాన్ని మాత్రం ఎవరికీ చూపించలేదు. అతని చేతులు తప్ప మరేమీ కనిపించలేదు ఆ ఫొటోల్లో.
'ఈ రోజు నాకు ఒక గొప్ప రోజు. ఎప్పటి నుంచో నాకున్న ఒక పెద్ద కల త్వరలో నెరవేరబోతోంది. ఇది జరిగిందంటే ఇప్పటికీ నమ్మశక్యంగా లేదు. ఈ విషయాన్ని మీతో పంచుకోకుండా ఉండలేకపోతున్నా' అంటూ సోషల్ మీడియాలో ఎంగేజ్ మెంట్ ఫొటోలు పోస్ట్ చేసి.. ఇలా రాసుకొచ్చింది సోనాక్షి. కాగా.. ఎంగేజ్మెంట్ చేసుకున్న సోనాక్షికి నెటిజన్లు, ఆమె అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతుండగా.. కొందరు మాత్రం.. ఇంత సీక్రెట్ గా చేసుకోవాల్సిన అవసరం ఏంటి? కాబోయే భర్త ముఖాన్ని దాయాల్సిన అవసరం ఏమిటని అడుగుతున్నారు. అయితే.. కొంతకాలంగా సోనాక్షి.. బాలీవుడ్ నటుడు జహీర్ ఇక్బాల్ తో డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. ఈ నేపథ్యంలో సోనాక్షి అతనితోనే నిశ్చితార్థం చేసుకుని ఉంటుందని నెటిజన్లు భావిస్తున్నారు.
Next Story