Mon Dec 23 2024 14:33:13 GMT+0000 (Coordinated Universal Time)
Vyooham : ఆర్జీవీ 'వ్యూహం' ప్రమోషన్స్లో అమితాబ్ బచ్చన్..
'వ్యూహం' మూవీ ప్రమోషన్స్కి ఆర్జీవీ.. ఏకంగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ని ఉపయోగించేసుకుంటున్నారు.
Vyooham : రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన 'వ్యూహం', 'శపథం' సినిమాలు ఎన్నో వివాదాలు ఎదుర్కొని ఎట్టకేలకు విడుదల తేదీలను ఫిక్స్ చేసుకున్నాయి. మార్చి 2న వ్యూహం విడుదల అవుతుంటే.. శపథం మార్చి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ ని తనదైన స్టైల్ లో చేస్తూ వస్తున్న ఆర్జీవీ.. ఈసారి ఏకంగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ని వ్యూహం ప్రమోషన్స్ కి ఉపయోగించేసుకుంటున్నారు.
నేడు ఆర్జీవీ డెన్ లో వ్యూహం మూవీ ప్రొడ్యూసర్ దాసరి కిరణ్ కుమార్ మరియు వర్మతో అమితాబ్ భేటీ అయ్యారు. అందుకు సంబంధించిన ఫోటోని వర్మ తన ట్విట్టర్ లో షేర్ చేస్తూ.. వ్యూహం విత్ అమితాబ్ అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట వైరల్ గా మారింది. ఇది చూసిన కొందరు నెటిజెన్స్.. వ్యూహం కోసం అమితాబ్నే లైన్ లోకి తెచ్చాడంటే వర్మ మామూలోడు కాదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
అయితే అమితాబ్, వర్మ మీటింగ్ వెనుక కారణం ప్రభాస్ 'కల్కి 2898 AD' అని తెలుస్తుంది. ప్రస్తుతం కల్కి సినిమాలో నటిస్తున్న అమితాబ్ షూటింగ్ పని మీద హైదరాబాద్ వచ్చారని, చిత్రీకరణ గ్యాప్ లో తన మిత్రుడు వర్మని కలుసుకునేందుకు ఆర్జీవీ ఆఫీస్ కి వచ్చినట్లు తెలుస్తుంది.
ఇక వ్యూహం, శపథం సినిమాల కథ విషయానికి వస్తే.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన తరువాత జగన్ మోహన్ రెడ్డి ఎదుర్కున్న సంఘటనలు ఏంటి..? ఆయన సీఎం ఎలా అయ్యారు..? అనే విషయాలను ఈ మూవీలో చూపించబోతున్నట్లు వర్మ పేర్కొన్నారు. ఈక్రమంలోనే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, చిరంజీవితో పాటు మరికొంతమంది ప్రముఖుల పాత్రలను కూడా సినిమాలో చూపించనున్నారు.
Next Story