Wed Jan 15 2025 16:22:38 GMT+0000 (Coordinated Universal Time)
Bollywood Hero : హిమాలయాల్లో నగ్నంగా తిరుగుతున్న బాలీవుడ్ హీరో..
ఒంటిమీద నూలు పోగు కూడా లేకుండా బాలీవుడ్ హీరో హిమాలయాల్లో నగ్నంగా తిరుగుతున్నారు. ఇంతకీ ఆ బాలీవుడ్ హీరో ఎవరు..?
Bollywood Hero : కొందరు హీరోలు వరుస సినిమాల్లో పని చేస్తూ మెంటల్ స్ట్రెస్ కి గురవుతుంటారు. దీంతో దానిని నుంచి కోలుకునేందుకు అప్పుడప్పుడు టూర్లు వేస్తుంటారు. ఈక్రమంలోనే మహేష్ బాబు అమెరికా, రజినీకాంత్ హిమాలయాలకు ఎక్కువ వెళ్తుంటారు. తాజాగా ఒక బాలీవుడ్ హీరో కూడా హిమాలయాలకు వెళ్లారు. అయితే అక్కడ ఒంటిమీద నూలు పోగు కూడా లేకుండా తిరుగుతున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆ బాలీవుడ్ హీరో ఎవరు..?
ఎన్టీఆర్ 'శక్తి' సినిమాలో విలన్ గా నటించి కెరీర్ ని స్టార్ట్ చేసిన నటుడు 'విద్యుత్ జమ్వాల్'. ఆ తరువాత ఊసరవెల్లి, తుపాకీ, బిల్లా 2 వంటి సౌత్ సినిమాల్లో ప్రతినాయకుడు పాత్రల్లో కనిపించారు. 2013లో విద్యుత్ జమ్వాల్ హీరోగా బాలీవుడ్ లో తెరకెక్కిన 'కమెండో' సినిమాతో హిందీలో మంచి గుర్తింపుని సంపాదించుకున్నారు. ఇక అప్పటి నుంచి అక్కడే వరుస సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు. కాగా ఈ నటుడు ప్రతి సంవత్సరం ఒక 7-10 రోజులు హిమాలయాలకు వెళ్తారంటా. అక్కడ అడవుల్లో కొన్ని రోజులు జీవిస్తే తన గురించి తాను తెలుసుకునే అవకాశం దొరుకుతుందని విద్యుత్ జమ్వాల్ చెబుతున్నారు.
విద్యుత్ జమ్వాల్ ఒంటి మీద నూలు పోగు లేని కొన్ని ఫొటోలు షేర్ చేస్తూ.. "గత 14 ఏళ్లగా ప్రతి సంవత్సరం దైవ నివాసమైన హిమాలయాలకు వస్తున్నాను. ఇక్కడ 7-10 రోజులు గడిపి నా గురించి నేను తెలుసుకొని, మళ్ళీ తిరిగి వచ్చి కొత్త జీవితాన్ని గడుపుతాను" అంటూ పేర్కొన్నారు. ప్రస్తుతం విద్యుత్ జమ్వాల్ షేర్ చేసిన పిక్స్ వైరల్ గా మారాయి. ఆ ఫొటోల్లో విద్యుత్ జమ్వాల్ బట్టలు లేకుండా ఉన్నారు. నదిలో సూర్య నమస్కారాలు చేస్తూ, కట్టెలతో వంట చేసుకుంటూ కనిపిస్తున్నారు. ఈ పిక్స్ చూసి నెటిజెన్స్ షాక్ అవుతున్నారు.
Next Story