Mon Dec 23 2024 11:02:59 GMT+0000 (Coordinated Universal Time)
NTR : వార్ 2 సినిమాలో ఎన్టీఆర్కి జోడిగా ఆ హీరోయిన్..
వార్ 2లో ఎన్టీఆర్ కి జోడిగా ఆ బాలీవుడ్ భామని మూవీ టీం ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. ఇంతకీ ఎవరు ఆ హీరోయిన్..?
NTR : ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తూ నటిస్తున్న చిత్రం 'వార్ 2'. హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ విలన్ పాత్ర చేస్తున్నట్లు సమాచారం. అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో హీరోయిన్ గా కియారా అద్వానీ నటిస్తున్నారు. హృతిక్ కి జోడిగా కియారా కనిపించబోతుందని తెలుస్తుంది. ఇక ఎన్టీఆర్ కి జోడిగా మరో బాలీవుడ్ భామని మూవీ టీం ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. ఇంతకీ ఎవరు ఆ హీరోయిన్..?
మోడలింగ్ చేసి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పలు చిత్రాలకు డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేసిన 'శార్వరి' అనే భామ ఎన్టీఆర్ కి హీరోయిన్ గా నటించబోతుందని సమాచారం. డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో కెరీర్ స్టార్ట్ చేసిన శార్వరి.. 2020లో 'ది ఫర్గటెన్ ఆర్మీ - ఆజాది కె లియే' అనే వెబ్ సిరీస్ తో నటిగా కెరీర్ మొదలు పెట్టింది. ఆ తరువాత 2021లో 'బంటి ఔర్ బబ్లీ 2' మూవీతో హీరోయిన్ గా వెండితెరకు పరిచయం అయ్యింది. ప్రస్తుతం బాలీవుడ్ లోని పలు సినిమాల్లో నటిస్తున్న ఈ భామ.. వార్ 2లో ఎన్టీఆర్ పక్కన ఛాన్స్ అందుకున్నట్లు తెలుస్తుంది.
మరి ఈ వార్తలో ఎంత నిజముందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఎదురు చూడాల్సిందే. కాగా వార్ 2 మూవీ యాష్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. వార్ 2 లో విలన్ గా పరిచయం కాబోతున్న ఎన్టీఆర్.. ఈ స్పై యూనివెర్స్ లో డేంజరస్ విలన్ గా కనిపించబోతున్నారట. అవెంజర్స్ లో 'థానోస్'లా ఈ స్పై యూనివెర్స్ లో ఉన్న హీరోలు సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ కి ఎన్టీఆర్ మెయిన్ విలన్ గా కనిపించబోతున్నారని బాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది.
ఆల్రెడీ షూటింగ్ మొదలు పెట్టుకున్న ఈ చిత్రం.. మొదటి షెడ్యూల్ ని కూడా పూర్తి చేసుకుంది. స్పెయిన్ లో ఒక కార్ ఛేజింగ్ యాక్షన్ సీక్వెన్స్ ని చిత్రీకరించారు. అయితే ఈ షూటింగ్ ఎన్టీఆర్, హృతిక్ లేకుండానే జరిగింది. హీరోల డూపులతో ఆ యాక్షన్ సీక్వెన్స్ ని పూర్తి చేశారు దర్శకుడు. ఈ మూవీ సెట్స్ లోకి ఎన్టీఆర్ ఎప్పుడు ఎంట్రీ ఇస్తారని అభిమానులంతా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.
Next Story