Thu Dec 19 2024 12:54:35 GMT+0000 (Coordinated Universal Time)
Pushpa 2 : పుష్ప 2 ఐటెం సాంగ్ కోసం ఆ భామలు..!
పుష్ప 2 ఐటెం సాంగ్ కోసం ఆ ఇద్దరు బాలీవుడ్ భామలు..
Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ 'పుష్ప 2'. ఈ సినిమా మొదటి భాగం నేషనల్ లెవెల్ ఎంతటి విజయం సాధించిందో అందరికి తెలుసు. ఇక ఈ మూవీలోని మేనరిజమ్స్, సాంగ్స్ అయితే ఇంటర్నేషనల్ లెవెల్ లో ఆదరణ పొందాయి. పుష్ప 1కి వచ్చిన ఈ క్రేజ్ ని అంతా దృష్టిలో పెట్టుకొని సెకండ్ పార్ట్ ని మరింత భారీగా తెరకెక్కిస్తున్నారు. ఈక్రమంలోనే ఈ మూవీలోని ఐటెం సాంగ్ ని కూడా డిజైన్ చేస్తున్నారు.
ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. దేవిశ్రీ అంటే ఐటెం సాంగ్స్ పై ఆడియన్స్ లో ఓ రేంజ్ క్రేజ్ ఉంటుంది. అలాంటిది మొదటి భాగంలో సమంతతో 'ఊ అంటావా మావా.. ఊఊ అంటావా' అంటూ చేయించిన ఐటెం సాంగ్ మాస్ ని ఒక ఊపు ఊపేసింది. దీంతో సెకండ్ పార్ట్ లోని ఐటెం సాంగ్ పై చాలా అంచనాలు నెలకొన్నాయి. వాటికీ తగ్గట్టే దేవిశ్రీప్రసాద్ ఒక అదిరిపోయే ట్యూన్ చేశారని తెలుస్తుంది.
అయితే ఇక్కడ పెద్ద ప్రశ్నగా మారిన విషయం ఏంటంటే.. ఈ సాంగ్ లో ఆడే ఐటెం భామ ఎవరు..? 'ఊ అంటావా' సాంగ్ లో సమంత ఒక స్టాండర్డ్ సెట్ చేసింది. ఇప్పుడు ఆ స్టాండర్డ్ ని దాటేలా, బాలీవుడ్ ఆడియన్స్ ని కూడా ఉర్రూతలూగించేలా అందాల భామ కావాలి. ఈ నేపథ్యంలోనే మూవీ టీం ఇద్దరి భామల పేర్లు పరిశీలిస్తున్నారట. బాలీవుడ్ మెరుపు తీగలు కృతి సనన్ , దిశా పటానీలో ఒకర్ని ఐటెం సాంగ్ కోసం తీసుకోవాలని చిత్ర యూనిట్ ఆలోచిస్తుందట.
మరి ఫైనల్ గా ఎవరు ఓకే అవుతారు చూడాలి. కాగా ఈ మూవీని 2024 ఆగష్టు 15న రిలీజ్ చేయడానికి మేకర్స్ డేట్స్ ఫిక్స్ చేశారు. ఈ తేదీ లాంగ్ వీకెండ్ తో వస్తుంది. నార్త్ లో ఈ సినిమాకి భారీ హైప్ క్రియేట్ అయ్యింది. రిలీజ్ సమయంలో ఈ మూవీతో పాటు మరే పెద్ద సినిమా విడుదల లేకుంటే మాత్రం.. పుష్ప 2 బాహుబలి రికార్డుని అందుకునే అవకాశం కూడా ఉందంటూ ట్రేడ్ పండితులు చెబుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్, సునీల్, అనసూయ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
Next Story