Mon Dec 23 2024 14:59:42 GMT+0000 (Coordinated Universal Time)
బాలీవుడ్లో 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' రీమేక్ కోసం పోటీ..
'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' హిట్ అవ్వడంతో బాలీవుడ్ లోని రెండు పెద్ద నిర్మాణ సంస్థలు ఈ మూవీ రీమేక్ రైట్స్ కోసం పోటీ పడుతున్నట్లు సమాచారం.
నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty) హీరోగా అనుష్క శెట్టి (Anushka Shetty) హీరోయిన్ గా ఫ్రెష్ కాంబినేషన్ తో ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. యూవీ క్రియేషన్స్ నిర్మించిన ఈ సినిమాని కొత్త డైరెక్టర్ పి.మహేష్ బాబు తెరకెక్కించాడు. న్యూ ఏజ్ లవ్ స్టోరీతో తెరకెక్కిన ఈ మూవీలో నవీన్ స్టాండప్ కమెడియన్గా, అనుష్క చెఫ్గా నటించారు. సెప్టెంబర్ 7న రిలీజ్ అయిన ఈ సినిమా సక్సెస్ టాక్ ని సొంతం చేసుకొని బాక్స్ ఆఫీస్ వద్ద మెల్లిమెల్లిగా కలెక్షన్స్ పెంచుకుంటూ వచ్చింది.
ఇప్పటి వరకు ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 40 కోట్ల వరకు కలెక్షన్స్ ని రాబట్టింది. కాగా ఈ మూవీని కేవలం సౌత్ లాంగ్వేజ్స్ తెలుగు, కన్నడ, మలయాళ, తమిళ భాషల్లో మాత్రమే రిలీజ్ చేశారు. ఇక విడుదలైన నాలుగు భాషల్లో మంచి విజయాన్ని అందుకోవడంతో.. ఇప్పుడు ఈ మూవీ పై హిందీ మేకర్స్ దృష్టి పడింది. ఈ సినిమా రీమేక్ రైట్స్ కొనేందుకు బాలీవుడ్ లోని రెండు పెద్ద నిర్మాణ సంస్థలు పోటీ పడుతున్నట్లు సమాచారం.
కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్, యశ్ రాజ్ ఫిలిమ్స్ సంస్థలు.. 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' రీమేక్ రైట్స్ ని సొంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు ఫిలిం వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ రీమేక్ రైట్స్ ని ఏ ప్రొడక్షన్ హౌస్ సొంతం చేసుకుంటుందో చూడాలి. అయితే టాలీవుడ్ ఆడియన్స్ ఈ సినిమాని హిందీలో కూడా డబ్ చేసి రిలీజ్ చేసేయండి అంటూ సోషల్ మీడియాలో సలహాలు ఇస్తున్నారు.
కాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ ఓటీటీ రైట్స్ ని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. అక్టోబర్ సెకండ్ వీక్ లో ఈ సినిమాని ఓటీటీలో రిలీజ్ చేయనున్నారని టాక్ వినిపిస్తుంది.
Next Story