Mon Dec 23 2024 02:55:00 GMT+0000 (Coordinated Universal Time)
అప్పడు పునీత్.. ఇప్పుడు సిద్ధాంత్.. జిమ్ చేస్తూ బాలీవుడ్ నటుడు మృతి
సీరియల్ లో నటించక ముందు.. అతని పేరు ఆనంద్ కాగా.. ఇటీవలే పేరు మార్చుకున్నాడు. సుఫియానా ఇష్క్ మేరా, జిద్ది దిల్ మానే నా..
బాలీవుడ్ లో విషాద ఘటన జరిగింది. జిమ్ చేస్తూ.. ప్రముఖ మోడల్, నటుడు సిద్ధాంత్ వీర్ సూర్యవంశీ (46) కన్నుమూశాడు. జిమ్ లో వర్కవుట్ చేస్తూ.. ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు సిద్ధాంత్. అతని మరణ వార్తతో బాలీవుడ్ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. సిద్ధాంత్ కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కసౌతి జిందగీ కే సీరియల్ ద్వారా సిద్ధాంత్ వీర్ సూర్యవంశీ పేరు సంపాదించుకున్నాడు.
సీరియల్ లో నటించక ముందు.. అతని పేరు ఆనంద్ కాగా.. ఇటీవలే పేరు మార్చుకున్నాడు. సుఫియానా ఇష్క్ మేరా, జిద్ది దిల్ మానే నా , వారిస్, సాత్ ఫేరే సలోని కా సఫర్ వంటి సీరియల్స్ తో పాటు.. పలు టెలివిజన్ షోలలోనూ కనిపించాడు. చివరిసారిగా సిద్ధాంత్ జీ టీవీ షో కూ రిష్టన్ మే కట్టి బట్టిలో కనిపించాడు. సిద్ధాంత్ మృతి పట్ల బాలీవుడ్ నటీనటులు సంతాపం వ్యక్తం చేశారు. కాగా.. గతేడాది కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కూడా ఇదే రీతిలో కన్నుమూశారు.
Next Story