Mon Dec 23 2024 10:21:42 GMT+0000 (Coordinated Universal Time)
కాజోల్ కు కరోనా.. మొహం చూపించలేకపోతున్నా !
కూతురు నైసా ఫోటోను పోస్ట్ చేసిన కాజోల్.. తన ఫోటో కంటే నైసా ఫోటోను ఎందుకు ఎంచుకుందో కూడా వెల్లడించింది.
కరోనా థర్డ్ వేవ్ లో.. మహమ్మారి వైరస్ బారిన పడిన బాలీవుడ్ సెలబ్రిటీల లిస్ట్ లోకి.. సీనియర్ నటి కాజోల్ కూడా చేరింది. తనకు కరోనా పాజిటివ్ వచ్చిందన్న విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది కాజోల్. అయితే.. నా మొహం చూపించలేక.. నా కూతురి ఫొటోను చూపిస్తున్నానంటూ కాజల్ పోస్ట్ లో చెప్పడం గమనార్హం.
Also Read : ఆర్ఆర్ఆర్ కోసం డేట్స్ త్యాగం చేసిన నిర్మాత !
కూతురు నైసా ఫోటోను పోస్ట్ చేసిన కాజోల్.. తన ఫోటో కంటే నైసా ఫోటోను ఎందుకు ఎంచుకుందో కూడా వెల్లడించింది. తన కూతురి చిరునవ్వు, ప్రపంచంలోనే అత్యంత మధురమైనదని కాజోల్ చెప్పుకొచ్చింది. తన రుడాల్ఫ్ ముక్కునూ ఎవరూ చూడకూడదన్న ఉద్దేశ్యంతోనే చిరునవ్వుతో ఉన్న నైసా ఫోటో పోస్ట్ చేస్తున్నాను. ఈ పోస్ట్ ను చూసిన నెటిజన్లు.. కాజోల్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.
Next Story