Mon Dec 23 2024 05:04:35 GMT+0000 (Coordinated Universal Time)
Mrunal Thakur : మృణాల్తో డేటింగ్.. సింగర్ పోస్టు వైరల్..
మృణాల్తో డేటింగ్ పై రియాక్ట్ అయిన సింగర్ బాద్షా. ఇన్స్టాగ్రామ్ పోస్టు ప్రస్తుతం నెట్టింట..
Mrunal Thakur : మృణాల్ ఠాకూర్ ప్రేమ, పెళ్లి రూమర్స్ రోజురోజుకి ఎక్కువ అయ్యిపోతున్నాయి. ఆమె ఎక్కడ కనిపించినా అక్కడ ఒక రూమర్ ని సృష్టిస్తూ వస్తున్నారు. మొన్నటి మృణాల్ తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకుంటుందని వార్తలు రాగా, ఇప్పుడు బాలీవుడ్ ర్యాప్ సింగర్ బాద్షాతో మృణాల్ డేటింగ్ లో ఉందని చెబుతూ వైరల్ చేస్తున్నారు. అందుకు ఒక వీడియోని కూడా సాక్ష్యంగా చూపిస్తున్నారు.
ఆ వీడియోలో మృణాల్, బాద్షా ఒక పార్టీ ఈవెంట్ నుంచి వెళ్ళిపోతూ ఒకరి చేతులు ఒకరు పట్టుకొని కనిపించారు. ఇక ఇది చూపించి వారిద్దరూ డేటింగ్ లో ఉన్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు రావడం మొదలయ్యాయి. ఈ న్యూస్ బాగా వైరల్ అవుతుండడంతో బాద్షా.. వాటికీ చెక్ పెట్టేందుకు తన ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్టు పెట్టారు. "డియర్ ఇంటర్నెట్ ఈ మాట చెప్పి మిమ్మల్ని బాధపెడుతునందుకు క్షమించాలి. ఎందుకంటే మీరు అనుకున్నది ఏం జరగడం లేదు" అని పేర్కొన్నారు.
ఈ పోస్టుతో డేటింగ్ రూమర్స్ కి ఎండ్ కార్డు పడినట్లు అయ్యింది. కాగా మృణాల్ గతంలో బాద్షాతో కలిసి ఒక ఆల్బమ్ సాంగ్ లో నటించారు. దీంతో వారిద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. ఇక ఆ వీడియోలో కూడా పార్టీ నుంచి వెళ్లే సమయంలో.. మృణాల్ బాద్షాకి గుడ్ బై చెప్పే క్రమంలో అలా చేతులు జోడించుకున్నారు. అయితే నెటిజెన్స్ ఆ వీడియోని తీసుకోని నెట్టింట డేటింగ్ రూమర్స్ ని పుట్టించేస్తున్నారు.
ఇక మృణాల్ సినిమా విషయాలకు వస్తే.. తెలుగులో నాని సరసన 'హాయ్ నాన్న', విజయ్ దేవరకొండతో 'ఫ్యామిలీ స్టార్' సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం మృణాల్ హాయ్ నాన్న సినిమాలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. డిసెంబర్ 7న ఈ మూవీ రిలీజ్ అయ్యేందుకు సిద్దమవుతుంది. కొత్త డైరెక్టర్ శౌర్యువ్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన సాంగ్స్ అండ్ టీజర్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్నాయి.
Next Story