Mon Dec 23 2024 20:31:56 GMT+0000 (Coordinated Universal Time)
Ranveer Singh : అడల్ట్ స్టార్ జానీ సిన్స్తో రణ్వీర్ టీవీ యాడ్..
రణ్వీర్ సింగ్ తో టీవీ యాడ్ కోసం అడల్ట్ స్టార్ జానీ సిన్స్ ని తీసుకు వచ్చిన బాలీవుడ్ మేకర్స్.
Ranveer Singh : బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్, అడల్ట్ స్టార్ జానీ సిన్స్తో.. ఇండియన్ టెలివిజన్ లో ఓ టీవీ యాడ్ చేశారు. ప్రస్తుతం ఈ యాడ్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. బాలీవుడ్ లోని బడా స్టార్స్ కూడా బ్రాండ్ తో సంబంధం లేకుండా దేనికైనా ప్రమోటర్గా మారిపోతుంటారు. షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్ వంటి స్టార్స్.. 'గుట్కా' వంటి వాటికీ బ్రాండ్ అంబాసడర్ చేయడం అందరూ చూస్తున్నదే. ఇక తాజాగా రణ్వీర్ సింగ్.. ఒక సెక్సువల్ ప్రోడక్ట్ కి బ్రాండ్ అంబాసడర్ గా మారిపోయాడు.
అయితే ఈ అంబాసడర్ అగ్రిమెంట్ లో అడల్ట్ స్టార్ జానీ సిన్స్ ని కూడా భాగస్వామ్యం చేసుకున్నారు. పోర్న్ ఇండస్ట్రీలో అడల్ట్ మూవీస్ చేసే జానీ సిన్స్ని.. సెక్సువల్ ప్రోడక్ట్ ప్రమోషన్ కోసం ఇండియా తీసుకు వచ్చారు. జానీ సిన్స్ అండ్ రణ్వీర్ తో బాలీవుడ్ సీరియల్ స్టైల్ ఓ యాడ్ ని షూట్ చేశారు. ఇక యాడ్ ని రణ్వీర్ తన సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు. ప్రస్తుతం అది నెట్టింట వైరల్ గా మారింది.
యాడ్ కోసం జానీ సిన్స్ ని ఇండియా తీసుకు వచ్చారా..? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమంది మాత్రం.. బాలీవుడ్ లో బిగ్గెస్ట్ స్టార్స్ గా ఉన్న వాళ్ళు ఎలాంటి యాడ్స్ చెయ్యాలో కూడా తెలియడం లేదంటూ విమర్శలు చేస్తున్నారు. మరి ఆ యాడ్ వైపు మీరు కూడా ఓ లుక్ వేసేయండి.
Next Story