Mon Dec 23 2024 07:19:38 GMT+0000 (Coordinated Universal Time)
Salaar Collections : బాలీవుడ్‌ని టెన్షన్ పెడుతున్న సలార్ కలెక్షన్స్..
బాలీవుడ్‌ని టెన్షన్ పెడుతున్న సలార్ కలెక్షన్స్. బాహుబలి 2 రికార్డుని బ్రేక్ చేయడానికి ఐదేళ్ల సమయం తీసుకున్న బాలీవుడ్..
Salaar Collections : ప్రభాస్ సలార్ పార్ట్ 1 ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. అలాగే బాక్స్ ఆఫీస్ ఊచకోత కూడా మొదలు పెట్టేసింది. ప్రశాంత్ నీల్ రూపొందించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్.. ఐదేళ్ల నుంచి ఆకలితో ఉన్న రెబల్ అభిమానుల ఆకలిని తీర్చింది. ప్రభాస్ ని పక్కా మాస్ క్యారెక్టర్ లో చూసిన అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక ప్రభాస్ కట్ అవుట్ కి ప్రశాంత్ నీల్ ఎలివేషన్స్ తోడు అవ్వడంతో మూవీ లవర్స్ కూడా సినిమా బ్లాక్ బస్టర్ అంటున్నారు.
ఇక భారీ అంచనాలతో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగిన ఈ చిత్రం.. ఫస్ట్ డే ప్రపంచవ్యాప్తంగా రూ.178.7 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుంది. మొదటిరోజే దాదాపు 200 కోట్ల మార్క్ కి దగ్గరిలో కలెక్షన్స్ రాబట్టిన ఈ చిత్రాన్ని చూసి బాలీవుడ్ కి టెన్షన్ మొదలైంది. బాహుబలి 2 సినిమా కలెక్షన్స్ తో బాలీవుడ్ లో ప్రభాస్ క్రియేట్ చేసిన ఇండస్ట్రీ హిట్ రికార్డుని బ్రేక్ చేయడానికి బాలీవుడ్ స్టార్స్ కి ఐదేళ్లు పట్టింది. ఈ సంవత్సరం షారుఖ్ ఖాన్ 'జవాన్', 'పఠాన్' సినిమాలతో బాహుబలిని మూడో స్థానంలోకి నెట్టాడు.
ఇప్పుడు సలార్ మొదటి రోజు కలెక్షన్స్ చూస్తుంటే.. ప్రభాస్ ఆ ప్లేస్ ని మళ్ళీ ఎక్కడ లాగేసుకుంటాడో అని భయపడుతున్నారు. ఈ ఏడాది పాన్ ఇండియా మార్కెట్ టాప్ గ్రాసర్స్ గా మొదటి మూడు స్థానాల్లో జవాన్, పఠాన్, యానిమల్ ఉన్నాయి. ఇప్పుడు సలార్ ఫస్ట్ డే కలెక్షన్స్ చూస్తుంటే.. ఆ సినిమా సెట్ చేసిన రికార్డులను కొన్ని రోజులోనే అందుకునేలా ఉంది. జవాన్ 1100 కోట్లకు పైగా, పఠాన్ 1000 కోట్లకు పైగా, యానిమల్ 800 కోట్లకు పైగా కలెక్షన్స్ ని నమోదు చేసింది. మరి సలార్ తో ప్రభాస్ ఏం చేస్తారో చూడాలి.
Next Story