Mon Dec 23 2024 09:23:22 GMT+0000 (Coordinated Universal Time)
ఎట్టకేలకు శ్రీదేవి మరణ రహస్యాన్ని బయటపెట్టిన బోనీ కపూర్..
ఎక్కడో విదేశాల్లో చనిపోయిన శ్రీదేవి మరణం ఒక రహస్యంగా ఉంది. తాజాగా బోనీ కపూర్ ఆ రహస్యాన్ని బయట పెట్టాడు.
భారతీయ సినీ పరిశ్రమలో కొన్ని దశాబ్దాలు పాటు మహారాణిగా వెలిగిన నటి 'శ్రీదేవి'. సౌత్ టు నార్త్ ఎన్నో వందల సినిమాల్లో నటించింది. తన అందం, అభినయంతో ఆడియన్స్ ని మాత్రమే కాదు తన తోటి యాక్టర్స్, టెక్నీషియన్స్ ని కూడా తన అభిమానులుగా మార్చుకుంది. కలలరాణిగా ఫ్యాన్స్ గుండెల్లో సుస్థిర స్థానం దక్కించుకున్న శ్రీదేవి.. 54 ఏళ్ళ వయసులో సడన్ గా మరణించడం అందర్నీ షాక్ కి గురిచేసింది.
2018లో తన భర్త బోనీ కపూర్ తో కలిసి దుబాయ్ లో జరిగే ఓ పెళ్ళికి వెళ్లిన శ్రీదేవి.. అక్కడ హోటల్ లోని బాత్ రూమ్ టబ్ లో పడి యాక్సిడెంటల్ గా మరణించింది. ఐదు పదుల వయసులో కూడా ఎంతో ఆరోగ్యంగా, అందంగా కనిపించే శ్రీదేవి.. ఎక్కడో విదేశాల్లో మరణించడం చాలామందిలో సందేహాలు రేకితించాయి. ఈక్రమంలోనే భర్త బోనీ కపూర్ పై అనుమానాలు వచ్చాయి. దుబాయ్ పోలీసులు కూడా బోనీ కపూర్ ని అదుపులోకి తీసుకోని విచారించడంతో ఆ అనుమానాలకు మరింత బలం చేకూరింది.
అయితే అసలు అక్కడ ఏం జరిగింది అనే దాని గురించి బోనీ కపూర్ ఎప్పుడు బయట మాట్లాడలేదు. దీంతో శ్రీదేవి మరణం ఒక రహస్యంగా ఉండిపోయింది. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాలు గురించి బోనీ కపూర్ మొదటిసారి మాట్లాడాడు. బోని కపూర్ మాట్లాడుతూ.. "శ్రీదేవి చనిపోయిన తరువాత ప్రతి ఒక్కరు నన్నే అనుమానించారు. భారత్ ఎంబసీ నుంచి కూడా దుబాయ్ పోలీసుల పై తీవ్ర ఒత్తిడి తెచ్చింది. దీంతో చేసేది లేక నన్ను వారు అదుపులోకి తీసుకోని సుమారు 24 గంటలు పాటు విచారించారు" అని చెప్పుకొచ్చాడు.
ఈ విచారణలో పలు రకాల టెస్టులు చేశారట. లై డిటెక్టర్ టెస్ట్ కూడా నిర్వహించినట్లు పేర్కొన్నాడు. తను ఏ తప్పు చేయలేదని తెలిసిన తరువాతే బోనీ కపూర్ ని దుబాయ్ పోలీసులు విడిచిపెట్టినట్లు చెప్పుకొచ్చాడు. ఇక శ్రీదేవి మరణ వెనుకున్న ఉన్న కారణం ఏంటనేది కూడా తెలియజేశాడు. అందంగా కనిపించేందుకు శ్రీదేవి కఠినమైన డైట్ ఫాలో అయ్యేదట. ఈ క్రమంలోనే ఉప్పు లేని ఆహారం తినేదట. దీని వల్ల 'లో బిపి' వచ్చి పడిపోయేదట.
అయితే ఈ విషయం పెళ్ళైన కొన్నాళ్ల వరకు బోనీ కపూర్ కి కూడా తెలియదట. ఇక ఈ విషయం గురించి డాక్టర్లు శ్రీదేవిని చాలా సార్లు హెచ్చరించినట్లు కూడా చెప్పుకొచ్చాడు. దీని వల్లే శ్రీదేవి బాత్ రూమ్ లో పడి చనిపోయినట్లు వెల్లడించాడు. శ్రీదేవి చనిపోయిన తరువాత బోనీ కపూర్ ని కలిసిన నాగార్జున.. శ్రీదేవి స్ట్రిక్ట్ డైట్ గురించి, దాని వల్ల షూటింగ్స్ లో కళ్ళు తిరిగి పడిపోయిన సందర్బాలు గురించి చెప్పినట్లు కూడా ఈ ఇంటర్వ్యూలో తెలియజేశాడు. ఇక శ్రీదేవి మరణం వెనుక రహస్యం బయట పెట్టడంతో ఇప్పుడు బోనీ కపూర్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
Next Story