Mon Dec 23 2024 12:24:34 GMT+0000 (Coordinated Universal Time)
మీడియా ప్రతినిధులను కొట్టిన తమన్నా బౌన్సర్లు
తమన్నా, దర్శకుడు మధుర్ భండార్కర్ ఇద్దరూ సినిమా గురించి మాట్లాడటానికి
తమన్నా హిందీలో 'బబ్లీ బౌన్సర్' అనే సినిమా తీసింది. ఆ సినిమాను తెలుగులో డబ్ చేశారు. డైరెక్ట్ ఓటీటీలో విడుదల చేయబోయే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనడానికి తమన్నా హైదరాబాద్ కు వచ్చింది. ఆ కార్యక్రమం కాస్తా గొడవలతో నిండిపోయింది. తమన్నాకు సెక్యూరిటీగా వచ్చిన బౌన్సర్లు.. ఏకంగా మీడియా ప్రతినిధులపై దాడులకు దిగారు. ఈ గొడవలో మీడియా ప్రతినిధులకు కూడా గాయాలు అయ్యాయి.
తమన్నా భాటియా బబ్లీ బౌన్సర్ ప్రమోషన్‌ను కవర్ చేయడానికి వెళ్లిన మీడియా ప్రతినిధులపై శనివారం హైదరాబాద్ లో బౌన్సర్లు దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు వీడియోగ్రాఫర్లకు గాయాలయ్యాయి. అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరిగిన ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బబ్లీ బౌన్సర్ అనే మహిళా సెంట్రిక్ చిత్రం కోసం తమన్నా దర్శకుడు మధుర్ భండార్కర్‌తో చేతులు కలిపింది. సెప్టెంబర్ 23న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించింది. మీడియాతో ఇంటరాక్ట్ అవ్వడానికి చిత్ర యూనిట్ హైదరాబాద్ కు రాగా.. తమన్నా బౌన్సర్లు మీడియాపై దాడి చేశారు.
తమన్నా, దర్శకుడు మధుర్ భండార్కర్ ఇద్దరూ సినిమా గురించి మాట్లాడటానికి ప్రెస్ మీట్ కోసం అన్నపూర్ణ స్టూడియోస్‌కు చేరుకున్నారు. నటికి సంబంధించిన వీడియోలను రికార్డ్ చేసినప్పుడు తమన్నా బౌన్సర్లు అతిగా ప్రవర్తించారు. కొంతమంది మీడియా ప్రతినిధులపై దాడి చేశారు. వైరల్ అవుతున్న వీడియోలో కెమెరామెన్లపై బౌన్సర్లు దాడి చేయడం, కెమెరాలను పగులగొట్టడానికి ప్రయత్నించడం స్పష్టంగా చూడవచ్చు. ఈ ఘర్షణలో ఇద్దరు కెమెరామెన్లు గాయపడినట్లు సమాచారం. ఈ మొత్తం సంఘటన తమన్నా మరియు మధుర్ భండార్కర్ సమక్షంలో జరిగింది. ఈ విషయంపై చిత్ర యూనిట్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ రాలేదు. బబ్లీ బౌన్సర్ డిస్నీ+ హాట్‌స్టార్‌లో విడుదల కానుంది.
Next Story